»   »  మెల్లిగా మహేష్ ని లాగేస్తున్నారు

మెల్లిగా మహేష్ ని లాగేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ గెస్ట్ గా చేసినా లేక వాయిస్ ఓవర్ చెప్పినా ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అందుకేనేమో వెంకటేష్, పవన్ కాంబినేషన్ లో రూపొందే 'గోపాల గోపాల' చిత్రంకి ఆయన చేత వాయిస్ ఓవర్ చెప్పించాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. గతంలో పవన్ జల్సా సినిమాకు మహేష్ చెప్పిన వాయిస్ ఓవర్ బాగా ప్లస్ అయ్యింది. వెంకటేష్, మహేష్ కు మధ్య కూడా మంచి ర్యాపో ఉంది. ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేసారు. దాంతో వెంకటేష్ కోసం కూడా మహేష్ వచ్చే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.

తెలుగు తెరపై మరిన్ని మల్టీస్టారర్‌ సినిమాలకు సమయం ఆసన్నమైంది- ఇటీవల స్టార్‌ హీరోల నోటి నుంచి వస్తోన్న మాట ఇది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎవడు' తర్వాత ఇలాంటి ప్రయత్నాలు వూపందుకున్నాయి. అందులో భాగంగానే వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' సినిమాను వీరిద్దరూ తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'గోపాల గోపాల' అనే పేరును నిర్ణయించారు.

 Gopala Gopala may be included Mahesh

వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి

English summary

 Buzz is ‘Gopala Gopala makers are planning to rope in Mahesh Babu to do voice over. It is known that Venkatesh and Pawan Kalyan are starring in this ‘Oh My God’ re-make.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu