»   » టైటిల్ సెంటిమెంట్: గోపీచంద్ కి గమ్మత్తైన టైటిల్

టైటిల్ సెంటిమెంట్: గోపీచంద్ కి గమ్మత్తైన టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమావాళ్లకు రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో తమ హిట్టైన టైటిల్స్ ని పరిశీలించి, అదే తరహాలో తమ కొత్త చిత్రం టైటిల్ ని పెట్టాలని ప్లాన్ చేస్తూంటారు. గోపించంద్ కూడా అదే రూటులో ప్రయాణం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా హిట్ లేక అల్లాడుతున్న ఆయన తన తాజా చిత్రానికి తన హిట్ టైటిల్ సెంటిమెంట్ ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

చంద్రశేఖర్‌ యేలేటి దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వలంలో రూపొందుతున్న గోపిచంద్ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రానికి లౌక్యం అనే టైటిల్ ని పెట్టే అవకాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో శౌర్యం, శంఖం, రణం,సాహసం వంటి టైటిల్స్ ని గోపిచంద్ కి ఉండటంతో ఈసారి అదే తరహాలో లౌక్యం టైటిల్ ని పెట్టాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

 Gopichand -UV creations film titled?

ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. మణిశర్మ తనయుడు సాగర్‌ మహతి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ''మిర్చి తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గోపీచంద్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అని నిర్మాతలు చెప్తున్నారు.

అలాగే .. ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. చంద్రశేఖర్‌ యేలేటి దగ్గర పనిచేసిన రాధాకృష్ణకుమార్‌ తయారు చేసిన కథ, కథనాలు చాలా బాగున్నాయి. ''అన్నారు. చలపతిరావు, బ్రహ్మానందం, సుప్రీత్‌, కబీర్‌, హరీష్‌ ఉత్తమన్‌, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: శక్తిశరవణన్‌

English summary
Gopichand's new film under Radhakrishna Kumar is progressing in Hyderabad. According to sources filmmakers zeroed in on ‘Loukyam’ as the film's title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu