Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హన్సిక తీరుతో నిర్మాతలకు తడిచి పోతోంది!
హైదరాబాద్: సౌతిండియన్ స్టార్ హీరోయిన్లలో హన్సిక ఒకరు. ముఖ్యమంగా తమిళ సినీ పరిశ్రమలో హన్సిక స్టార్ హీరోయిన్. ఆమె చేస్తున్న సినిమాల్లో ఎక్కవు సినిమాలు కూడా తమిళ సినిమాలే. ఇక్కడ ఆముకు మంచి పేరుంది. హీరోయిన్ అంటే కేవలం అందం, అభినయం ఉంటే చాలదు, పని పట్ల నిబద్దత ఉండాలి. షూటింగ్ విషయంలో దర్శక నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. అలాంటి వారిలో హన్సిక ఒకరు అని అంటుంటారు.
ఇదంతా ఓకే కానీ....హన్సిక ఓ విషయంలో మాత్రం నిర్మాతలను ఇబ్బంది పెడుతోంది. హన్సికను హీరోయిన్‌గా హీరోయిన్‌గా బుక్ చేసుకున్న వాళ్లకు ఖర్చు తడిచి మోపెడు అవుతుందట. ఆమెకు ఇచ్చే రెమ్యూనరేషన్‌తో సమానంగా ఇతర ఖర్చులు అవుతున్నాయని అంటున్నారు.

సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఫైవ్ స్టార్ హోటల్ వసతి ఖర్చులు, ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెప్పించే తిండి ఖర్చులు, విమాన టిక్కెట్ల ఖర్చులు, ఆమె పర్సనల్ సిబ్బందికి అయ్యే ఖర్చులు....ఇవన్నీ నిర్మాత ఖాతాలోనే వేస్తుందట. పెద్ద సంస్థలు, నిర్మాతలు ఈ ఖర్చు విషయం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, ఓ మోస్తరు నిర్మాతలు మాత్రం ఆమె ఖర్చు విషయంలో ఇబ్బంది పడుతున్నారట.
హన్సిక సినిమాల విషయానికొస్తే....హన్సిక తెలుగులో గతేడాది ‘బలుపు' చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలేవీ కమిట్ కాలేదు. ప్రస్తుతం 7 తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఐదు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.