»   » పవన్ ఫాదర్ గా రెబల్ స్టార్ కాదు నందమూరి హీరో...!?

పవన్ ఫాదర్ గా రెబల్ స్టార్ కాదు నందమూరి హీరో...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గబ్బర్ సింగ్' లో పవన్ తండ్రిగా హరికృష్ణ నటిస్తారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, 'షాక్', 'మిరపకాయ్' చిత్రాల ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో తీన్ మార్ నిర్మాత గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం' గబ్బర్ సింగ్". బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్" సినిమానే తెలుగులో 'గబ్బర్ సింగ్" పేరుతో పునర్నిర్మిస్తున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్" సినిమాలో ముందుగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, సహజనటి జయసుధ హీరో పవన్ కళ్యాణ్ కి తల్లిదండ్రులుగా నటిస్తారని వినిపించింది. కానీ కృష్ణంరాజు తన సొంత బ్యానర్ పై తీసే సినిమా చర్చల్లో బిజీగా ఉండటం వల్ల ఈ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. తాజాగా నందమూరి హరికృష్ణ అయితే తండ్రి పాత్రకు సరిగ్గా సరిపోతారనే అభిప్రాయంతో ఈ సినిమా యూనిట్ ఉందట. అంతే కాకుండా హరికృష్ణ కుడా ఆ పాత్రలో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిసింది.

English summary
Harikrishna, father of Jr.Ntr is being considered to act as Pawan Kalyan’s father in Gabbar Singh, which is Dabangg remake. In fact the role is of a stepfather.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu