For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్‌ '...రాంబాబు' కు రిపేర్లు??

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంకు రీసెంట్ గా రిపేర్లు జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ అల్లు అర్జున్ తో చేయబోయే తన కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం బ్యాంకాక్ వెళ్లిపోవడంతో, రాంబాబు సినిమాకు ఓ పెద్ద స్టూడియోలో రిపేర్లు చేసారని చెప్పుకుంటున్నారు. సినిమా బాగానే వచ్చిందని, అక్కడక్కడ మార్పులు చేస్తే సరిపోతుందని, ఈ బాధ్యతను పవన్ స్వయంగా హరీష్‌శంకర్‌కు అప్పగించాడని అంటున్నారు. అయితే గురువు స్క్రిప్ట్‌ను హరీష్ ఏ మేరకు మార్చాడో..అవి ఎంత వరకూ సినిమాకు పనికివచ్చాయో చూడాలంటున్నారు. అయితే ఇప్పటివరకూ సినిమాపై మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది..

  'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. యూనివర్శల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ "మా చిత్రం సెన్సార్ పూర్తయింది. యు/ఎ వచ్చింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఎలాంటి కట్‌లు ఇవ్వలేదు. పవన్ కెరీర్‌లో ఇది ల్యాండ్‌మార్క్ సినిమా అవుతుంది. ఆయన పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. క్లైమాక్స్‌లో చెప్పిన డైలాగులు అందరికీ బాగా నచ్చుతాయి. తప్పకుండా పెద్ద రేంజ్ హిట్ అవుతుంది'' అని చెప్పారు.

  ''ఓ జర్నలిస్ట్‌కీ, ఓ రాజకీయనాయకునికీ మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను రాంబాబు ఎలా పారద్రోలాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.. చాలా సీరియస్ మోడ్‌లో సినిమా నడుస్తుంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. మీడియాపై జోక్స్ ఉన్నా అవి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉండవు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ ఇచ్చిన రీ-రికార్డింగ్‌లో చిన్న కరెక్షన్ కూడా చేయలేదు. పవన్ ఎంతో మురిసిపోతూ డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది'' అని చెప్పారు పూరి జగన్నాథ్.

  నిర్మాత మాట్లాడుతూ "సెన్సార్ సభ్యుల ఎక్సైట్‌మెంట్ చూస్తుంటే తప్పకుండా మా బ్యానర్‌లో ఇది పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందనిపించింది. సినిమా మీద మరింత నమ్మకం పెరిగింది. మణిశర్మ మంచి బాణీలిచ్చారు. హయ్యస్ట్ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల చేస్తున్నాం'' అని అన్నారు. తమన్నా, గేబ్రియల్, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: శ్యామ్.కె.నాయుడు, నిర్మాణం: యూనివర్శల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Pawan Kalyan’s Cameraman Gangatho Rambabu releasing on 18th October this Movie was censored today and was awarded with U/A certificate. There were no audio/visual cuts. The censor certification clears decks for a grand record release on 18 October in 1500+ of prints. CGR is releasing with a record number of 82 screens in USA for a Telugu film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X