»   » డిజే ఇష్యూ: హరీష్ శంకర్ సంచలన ట్వీట్, పవన్ ఫ్యాన్స్‌పైనా?

డిజే ఇష్యూ: హరీష్ శంకర్ సంచలన ట్వీట్, పవన్ ఫ్యాన్స్‌పైనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'డిజె' (దువ్వాడ జగన్నాథం). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ శివరాత్రి సందర్భంగా విడుదలై యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ టీజర్‌కు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

యూట్యూబ్‌లో వ్యూస్ తో పాటు దీన్ని ఎంత మంది ఇష్టపడ్డారు, ఎంత మందికి ఇది నచ్చలేదు అనేది కూడా ముఖ్యమే. ఈ టీజర్‌కు లక్షకుపైగా లైక్స్, అదే స్థాయిలో డిస్ లైక్స్ వచ్చాయి. ఈ స్థాయిలో డిస్ లైక్స్ రావడం చర్చనీయాంశం అయింది.


అల్లు అర్జున్‌తో కొంతకాలంగా విబేధిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ డిస్ లైక్స్ పని చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఇపుడో సెన్సేషన్ అయింది. హరీష్ శంకర్ స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రస్తావన తేక పోయినా....అందులో అర్థం అదే అంటున్నారు.


దానికి, దీనికి వీరే కారణం అంటూ...

డిజే టీజర్ 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సందర్బంగా హీరీష్ ఓ ట్వీట్ చేసారు. థాంక్స్ ఫర్ దట్ వ్యూస్, థాంక్స్ ఫర్ దిస్ లైక్స్, యత్ భావమ్ తత్ భవతి..... నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే... అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.


ఈ ట్వీట్ వెనక చాలా అర్థం

హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్ వెనక చాలా అర్థం ఉందని, లోతుగా ఆలోచిస్తే ఇందులో అసలు భావం బోధపడుతుందని అంటున్నారు. మరి దాని గురించి ఎవరు ఎలా ఊహించుకుంటే అలా అన్నమాట.


ఆకట్టకున్న టీజర్

ఆకట్టకున్న టీజర్

'ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని' అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ సరదాగా అనిపిస్తోంది. డీజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌) కి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో.. ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజ‌ర్‌తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.


హీరోయిన్ పూజా

హీరోయిన్ పూజా

దిల్ రాజు నిర్మిస్తున్న 'దువ్వాడ జగన్నాథం'లో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవి కానుకగా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో ఆడియో విడుదల చేస్తారు.


హాట్రిక్ కొడతానంటున్న దిల్ రాజు

హాట్రిక్ కొడతానంటున్న దిల్ రాజు

దిల్‌రాజు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... మా సంస్థ నిర్మిస్తోన్న 25వ చిత్రమిది. ఆర్య పరుగు తర్వాత బన్నీతో హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. మా బ్యానర్‌లో హరీష్‌శంకర్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో అతనితో చక్కటి అనుబంధం ఏర్పడింది. వేసవి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


English summary
Harish Shankar tweet about DJ movie teaser. The teaser of Allu Arjun's DJ aka Duvvada Jagannadham has crossed 5 million views on YouTube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu