»   » బాలయ్య 100వ సినిమాలో హేమా మాలిని?

బాలయ్య 100వ సినిమాలో హేమా మాలిని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య 100వ సినిమా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం దాదాపుగా ఖరారైనా.... ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. రెండో శతాబ్దంలో అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం డైరెక్టర్ క్రిష్ చేయబోతున్నారు. దాని కోసం 'యోధుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అని తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య తల్లి పాత్రకు బాలీవుడ్ సినీయర్ నటి హేమా మాలిని సంప్రదించినట్లు తెలుస్తోంది. రాజమాత గౌతమి పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. దాదాపు 50 ఏళ్ల క్రితం వచ్చిన పాండవ వనవాసం మూవీలో హేమా మాలిని స్ట్రైట్ తెలుగు సినిమా చేసారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించలేదు.

Hema Malini in Balakrishna’s 100th film?

దర్శకుడు క్రిష్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పే నా తదుపరి చిత్రం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఈ అవార్డు రావడం మరింత ఆనందంగా ఉంది'' అని తెలిపారు. ఒకప్పుడు అమరావతిని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు జాతి కీర్తి చాటిచెప్పే విధంగా సుపరిపాలన సాగించారు.....ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్య్వూలో క్రిష్ పరోక్షంగా బాలయ్య 100వ సినిమానే ప్రస్తావించాడని అంటున్నారు.

మరో వైపు బాలయ్య కూడా మహారాజు గెటప్ కు తగిన విధంగా మీసాలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తెర వెనక ఈ సినిమాకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని స్పష్టమవుతోంది. బాలయ్య ముహుర్తాలు బాగా నమ్ముతారు కాబట్టి.... ఉగాది రోజున సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

English summary
Film Nagar source said that veteran Bollywood actress Hema Malini will be approached to play Balakrishna’s mother role in 100th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu