»   » హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో హీరో నిఖిల్.. ఎటూ తేల్చుకోలేక..

హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో హీరో నిఖిల్.. ఎటూ తేల్చుకోలేక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ తారల మధ్య డేటింగ్స్, అఫైర్లు నడవటం అనేది చిత్రసీమలో సర్వసాధారణం. యువ హీరో, హీరోయిన్లు అయితే ఈ వార్తల హడావిడి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఒకట్రెండు సినిమాల్లో వరుసగా నటిస్తే నిప్పు లేకుండా పొగ పరిశ్రమను కమ్మేస్తుంది. తాజాగా రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ అఫైర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్. ఇదే జాబితాలో యంగ్ హీరో నిఖిల్ చేరాడనే గాసిప్ ప్రచారం జరుగుతున్నది. ఇటీవల కలిసి నటించిన హీరోయిన్‌తో చెట్టాపట్టాలు వేసుకొని తీరుగుతున్నట్టు తెలుస్తున్నది.

బుల్లితెరపై చలాకీగా

బుల్లితెరపై చలాకీగా

ఈ హీరోయిన్ ఎవరో కాదు.. చిన్నతనంలో టెలివిజన్ తెరపై బాల యాంకర్‌గా బుల్లి బుల్లి మాటలు, చలాకీ విసుర్లతో ఆకట్టుకొన్న చిన్నదనే తాజా సమాచారం. బుల్లి తెర నుంచి వెండి తెరకు ఎగుమతి అయిన తెలుగు హీరోయిన్ టాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నది.

దక్షిణాది చిత్రాల్లో అద్భుత నటన

దక్షిణాది చిత్రాల్లో అద్భుత నటన

ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆయ వర్గాలను ఫిదా చేసింది. పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనతో విమర్శల ప్రశంసలు అందుకొన్నది. ఇటీవల తెలుగులో ఆమె నటించిన సోలో హీరోయిన్ లాంటి చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలింది.

నిఖిల్‌తో నటించిన సినిమా సూపర్

నిఖిల్‌తో నటించిన సినిమా సూపర్

అంతకు ముందు నిఖిల్‌తో కలిసి నటించిన చిత్రం సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకొన్నది. అప్పుడే వారి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయిపోయిందట. అప్పటి నుంచి చాలాసార్లు క్లోజుగా తిరుగుతూ మీడియా కంట పడ్డటం కూడా గమనార్హం. మా మధ్య అలాంటి రిలేషన్ లేదని చెప్తున్నప్పటికీ వారి మధ్య ప్రేమ వ్యవహారం పీక్ స్థాయికి చేరుకొన్నట్టు సమాచారం.

సినిమాలను తగ్గించుకొంటున్న హీరోయిన్

సినిమాలను తగ్గించుకొంటున్న హీరోయిన్

దక్షిణాది భాషల్లో మంచి పేరు సంపాదించుకొన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలు గణనీయంగా తగ్గించుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెతో నిఖిల్ చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. వారి మధ్య ఉన్న బంధం మరో మెట్టు ఎక్కుతుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్న

విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్న

ప్రస్తుతం నిఖిల్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. మంచి కథాంశాలను ఎంచుకొంటూ ఘన విజయాలను సొంతం చేసుకొంటున్నాడు. ఇటీవల విడుదలైన కేశవ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకొన్నది. స్వామి రారా, కార్తీకేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. ఇలా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్న ఈ హీరో ఇప్పుడే పెళ్లి చేసుకొంటాడా అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇంతకీ నిఖిల్‌తో అఫైర్ ఉన్నట్టు ఉన్న హీరోయిన్ పేరు ఇప్పటికే మీకు గుర్తు వచ్చి ఉంటుంది.

English summary
Hero Nikhil career is zooming up with successful movies. Reports suggest that Nikhil dating with his co-star. Gossips reveals that They were in love. They moving forward with proposal to wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu