Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ టైటిల్ తో రామ్ నెక్ట్స్ చిత్రం ఖరారు
హైదరాబాద్ : రామ్ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పండగ చేస్కో' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే రామ్‌కి మరో చిత్రం కమిటయ్యారు. శ్రీనివాసరెడ్డి అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘శివం' అనే పేరు ఖరారు చేసారని తెలుస్తోంది. ఈ టైటిల్ తో గతంలో క్రిష్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా చేస్తారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అలాగే ‘సెకండ్ హ్యాండ్' మూవీతో దర్శకుడైన కిషోర్ తిరుమలతో సినిమా చేసేందుకు రామ్ సిద్దమయ్యాడట. ఈ చిత్రానికి ‘హరికథ' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్న కిషోర్ తిరుమల రామ్ నటిస్తున్న ‘పండగ చేస్కో' చిత్రం తర్వాత 'హరికథ' మొదలు పెడతారని ఫిలింనగర్ టాక్.

రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' విషయానికి వస్తే...
రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో'. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.
రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, సంపత్, రావు రమేష్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్, వెన్నెలకిశోర్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచన సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం: థమన్.ఎస్.ఎస్., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం.