»   » 'గబ్బర్‌సింగ్‌ 2' కి హీరోయిన్ ఫైనల్ చేసారు

'గబ్బర్‌సింగ్‌ 2' కి హీరోయిన్ ఫైనల్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది'' అంటూ చెలరేగిపోయిన 'గబ్బర్‌సింగ్‌'ని మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. పవన్‌ కల్యాణ్‌ పలికిన సంభాషణలు, ఆయన చూపించిన తిక్క.. జనాలకు బాగా నచ్చేశాయి. ఆ మత్తులో ఉండగానే... 'గబ్బర్‌సింగ్‌ 2' ప్రకటన వచ్చేసింది. కానీ సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది. దానికి పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండడం ఓ కారణం అయితే రెండోది హీరోయిన్ దొరకకపోవటం. అయితే ఇప్పుడా సమస్య తీరిదంని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా మందిని అనుకున్న తర్వాత కాజల్ అయితే సరిపోతుందని పవన్ భావించారని చెప్తున్నారు. కాజల్ కి మాత్రం పవన్ తో చేయటం పండగే.

పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగానే రాజకీయంగా చెలరేగిపోయి తనను నమ్ముకున్న పార్టీలను గెలిపించారు. అయితే సినిమా విషయానికి వచ్చేసరికి హీరోయిన్ సమస్య మాత్రం వీడ లేదు. తన ప్రక్కన నటించటానికి సరిపడ హీరోయిన్ తమ బడ్జెట్ లో దొరకటం లేదు. తన ఏజ్ కు తగ్గ అమ్మాయి దొరకాలి, అలాగే ఆ హీరోయిన్ అద్బుతంగా ఉండాలి, అలాగని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ని దిగుమతి చేసుకుందామనుకుంటే వాళ్లు బడ్జెట్ లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో హీరోయిన్ సమస్య గబ్బర్ సింగ్ 2 కి తీర లేదు. అయితే కాజల్ తో వీరు అనుకున్న అన్ని సమస్యలకి పరిష్కారం దొరికినట్లైంది. కాస్త బడ్జెట్ ఎక్కువైనా నటిగా ఆమె అనుభవం, భాక్సాఫీస్ వద్ద ఆమె సక్సెస్ దాన్ని అధిగమించి, ఆమెను ఎంపిక చేసుకునేలా చేసాయి.

 Heroine finalized for Gabbar Singh 2

అయితే ఇప్పుడు రాజకీయ వేడి కాస్త తగ్గడంతో పవన్‌ దృష్టి సినిమాలవైపు మళ్లింది. దాంతో 'గబ్బర్‌ సింగ్‌ 2' హంగామాకు రంగం సిద్ధమైంది. 'రచ్చ'తో బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంపత్‌నంది దర్శకత్వం వహించే చిత్రమిది. శరత్‌మరార్‌ నిర్మాత. ''గబ్బర్‌ సింగ్‌ కథకూ.. ఈ కథకూ సంబంధం ఉండదు. కానీ ఆ తిక్క మాత్రం ఉంటుంది. అభిమానులకు రెట్టింపు వినోదం అందిస్తాం. స్క్రిప్టు సిద్ధమైంది. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. పవన్‌ పచ్చజెండా వూపగానే చిత్రీకరణను మొదలుపెట్టేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

English summary
Pawan Kalyan ‘Gabbar Singh 2′ is expected to start soon. Kajal Aggarwal is selected as the female lead opposite Pawan Kalyan in his upcoming flick Gabbar Singh-2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu