»   » హీరోయిన్ కి ఫుడ్ బిల్ వారానికి అరవై వేలా? కష్టం

హీరోయిన్ కి ఫుడ్ బిల్ వారానికి అరవై వేలా? కష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆమె ఫైవ్ స్టార్ హోటల్ ఎకాండేషన్ డిమాండ్ చేసింది..అలాగే అన్నాం. ఆమె షాపింగ్ బిల్ లు రోజు కడుతున్నాం. అలాగే వారానికి అరవై వేలు చొప్పున పే చేసాం. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టుకు అంత ఖర్చుకావటం లేదు అని నెత్తినోరు కొట్టుకుంటున్నారు నిర్మాతలు. బిందాస్ చిత్రంలో మనోజ్ సరసన నటించిన షీనా మనిషి ఫీలగా ఉన్నా బిల్లుల విషయంలో భారీతనం చూపెడుతోంది.ఆమెతో కన్నండంలో చిత్రం తీస్తున్న నిర్మాత సౌమ్య ఈ విషయాలను మీడియాకు తెలియచేస్తూ...విసుగెత్తిపోయాం. ఆమె అన్ ప్రొఫిషనల్ బిహేవర్ తో వేగలేకపోతున్నాం. అప్పటికీ ఎలాగూ షూటింగ్ ప్రారంభించాం కదా అని భరిస్తూంటే మొన్నటికి మొన్న మినార్వా మిల్స్ లో పాట షూటింగ్ పెట్టుకుంటే నాకు ఒంట్లో బాగోలేదు అని మధ్యలో వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్దం కావటం లేదు అంటూ వాపోతోంది. ఇక బిందాస్ తో అందరినీ ఆకట్టుకున్నా ఆమెకు ఆఫర్స్ మాత్రం రాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu