»   » తను నటిస్తున్న సినిమానే ఆపాలని హీరోయిన్ విశ్వప్రయత్నం

తను నటిస్తున్న సినిమానే ఆపాలని హీరోయిన్ విశ్వప్రయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కెరీర్ ప్రారంభం రోజుల్లో ఏ వేషాలు లేనప్పుడు దగ్గరకు వచ్చిన కొన్ని ఆఫర్స్ ఒప్పుకుంటూంటారు. అయితే అనుకోకుండా స్టార్ అయ్యి, వెలగటం మొదలటం మొదలయ్యి, ఫ్యాన్స్ పెరిగాక ఆ సినిమాలు రిలీజ్ కాకుండా ఉంటే బాగుంటుందని అని భావిస్తారు.

ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తమ దగ్గరకు వచ్చే చాలా సినిమాలు ఊరు, పేరు లేని దర్శక,నిర్మాతలవి ఉంటాయి. అప్పుడు ఉన్న పరిస్దితుల్లో చేతిలో ఏమీ లేకపోవడటం, కమిటవ్వుతారు. కథ, సీన్స్ పట్టించుకోరు. వాటిలో చాలా బాగం ఆగిపోతాయి. కానీ కొన్ని సినిమాలు పూర్తి అయ్యి రిలీజ్ చేసే నాధుడు లేక మూలన పడి ఉంటాయి.

అయితే ఆ హీరోయిన్ కు లేదా హీరోకు ఇమేజ్ వచ్చాక, ఎగ్రిమెంట్ ప్రకారం సినిమాని పూర్తి చేయమంటూంటారు ఆ దర్శక,నిర్మాతలు. ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయని వాళ్లు ఆలోచన. కానీ రిలీజ్ అయితే తన ఇమేజ్ దెబ్బ తింటుందని వీళ్ల భయం. దాంతో ఎలాగైనా ఆ సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తూంటారు.

ఇప్పుడు అలాంటి పరిస్దితే తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఓ నటీమణికి ఎదురైందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆమె ప్రారంభం రోజుల్లో ఒప్పుకున్న సినిమా ఆమెకు తలనొప్పిగా తయారైందని చెప్తున్నారు. ఓ ప్రక్క ఆ నిర్మాత రోజూ ఫోన్ లు చేసి , సినిమా పూర్తి చేయమని ఒత్తిడి చేస్తున్నాడట.

ఆ సినిమా రిలీజైతే ఎక్కడ తన కెరీర్ నష్టపోతుందో అని ఆమె భయపడుతోందిట. ఇలా వీళ్లిద్దరి మధ్యా వాగ్వివాదం జరుగుతోందిట. చివరకు అతను పెట్టిన పెట్టుబడి, వడ్డి కట్టి, సినిమాని ప్రక్కన పెట్టమని మధ్యవర్తల చేత అడిగించే పనిలో ఉందిట. ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం ఈ స్టార్ హీరోయిన్ కు.

English summary
Young top actress is trying to stop her earlier movie snake shirt due to save her image.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu