»   » గోపీచంద్ కి అదే సమస్య

గోపీచంద్ కి అదే సమస్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సీనియర్ హీరోలతో నటించటానికి హీరోయిన్స్ దొరకటం లేదంటే అర్దముంది. కానీ గోపీచంద్ లాంటి యాక్షన్ హీరోకు సైతం హీరోయిన్స్ కొరత అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే గోపిచంద్ ఎత్తుకు తగ్గ హీరోయిన్ దొరకటం కష్టమవుతోంది. దానికి తోడు గోపీచంద్ వరస ఫెయిల్యూర్స్ లో ఉండటంతో అతనితో స్టార్ హీరోయిన్స్ ఎవరూ చేయటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. త్రిష లాంటి హీరోయిన్స్ తో చేద్దామంటే వాళ్ళు ఫేడవుట్ అయ్యి కూర్చున్నారు. ఈ నేపధ్యంలో గోపిచంద్ కు హీరోయిన్ ని వెతకటం అనేది దర్శక,నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.

మరో ప్రక్క గోపీచంద్‌ వేగం పెంచారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పుడు మరో చిత్రానికి పచ్చజెండా వూపారు. గోపీచంద్‌ హీరోగా యువీ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోపీచంద్‌ - చంద్రశేఖర్‌ యేలేటి కలయికలో వచ్చిన 'సాహసం' చిత్రానికి సంభాషణలు అందించారీయన. ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభ చూపించుకొనేపనిలో పడ్డారు. ఇటీవల గోపీచంద్‌కి కథ వినిపించి 'ఓకే' అనిపించుకొన్నారు. యాక్షన్‌, వినోదం మేళవించిన ఈ కథలో కుటుంబ ప్రేక్షకులకీ నచ్చే అంశాలున్నాయట. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది.

Heroines Problems to Tollywood Hero Gopichand

ప్రస్తుతం గోపీచంద్..బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని చెప్తున్నారు. ''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్‌ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్‌, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్‌, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. రిలీజ్,ఆడియో వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.

తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కెమెరా: బాలమురుగన్‌.

English summary

 Coming to Gopichand it is tough to get a heroine with good height and personality.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu