Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి అంటే ‘అందరివాడే’ కాదు.. అంతకు మించి ప్లాన్ చేస్తున్న బడా డైరెక్టర్.!
మెగాస్టార్ చిరంజీవికి సినిమాల విషయంలో ఎంత డెడికేషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క రీజన్ వల్లే ఆయన ఇంతకాలం ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నారనేది అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయనలో చాలా మార్పులు ఉంటాయేమో అనుకుంటున్న తరుణంలో 'ఖైదీ నెంబర్ 150'తో వాటన్నింటికీ బ్రేక్ వేశారు. అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన 'సైరా: నరసింహారెడ్డి' సినిమా కోసం ఆయన ఏడాది పాటు ఎంతగానో కష్ట పడ్డారు. డూప్ లేకుండా స్టంట్స్ చేసి షాకిచ్చారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...

ప్రతిష్టాత్మక చిత్రానికి ఎదురుదెబ్బ
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. దీనికి టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం విఫలం అయింది.

నిరాశను మిగిల్చినా వెనక్కి తగ్గడం లేదు
‘సైరా' విషయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌కు నిరాశ ఎదురైనప్పటికీ.. ఈ ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు. త్వరలోనే ప్రారంభం కానున్న కొరటాల శివ మూవీ కోసం నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ భారీ ఫ్లాన్స్ సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాను హిట్ చేసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చిరు, కొరటాలపై ఒత్తిడి.. అందుకే ఇలా
భారీ ఖర్చు పెట్టి తీసిన సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోవడంతో చిరంజీవి.. కొరటాలతో చేయబోయే మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన శారీరకంగా, మానసికంగా శ్రమిస్తున్నారని అంటున్నారు. అలాగే, మెగాస్టార్‌తో తనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు కొరటాల శివ కూడా ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

కథ, టైటిల్ విషయంలో మార్పులు
కొరటాల గత చిత్రాల్లానే ఇందులో కూడా సోషల్ మెసేజ్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. అందుకే ఈ సినిమాకు డివోషనల్ ఫీల్ కలిగేలా ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత కథతో పాటు టైటిల్‌ను మార్చాలని డిసైడ్ అయినట్లు టాక్.

త్వరలోనే ఆయనలోని మరో కోణం బయటకు
ఈ సినిమా కోసం కొరటాల శివ ఎన్నో ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని గతంలో ఎన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందుకోసం ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌ను సరికొత్తగా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి అంటే ‘అందరివాడే' కాదు
మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాల్లో కామెడీ యాంగిల్‌ను చూపించారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘అందరివాడు'లో ఆయన అదిరిపోయే కామెడీని పండించారు. ఇప్పుడు దానిని మరిచిపోయేలా చిరును చూపించబోతున్నాడట బడా డైరెక్టర్ కొరటాల. అందుకోసమే ప్రత్యేకమైన లైన్‌ను రెడీ చేశాడని సమాచారం.