Just In
- 2 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 47 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 53 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెడీ అయిన రేణు దేశాయ్.. పవన్‌తో మరోసారి ప్రయాణం.. క్రేజీ అప్‌డేట్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి మరోసారి ప్రయాణం చేసేందుకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అందుకోసమై ఆమె ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

పవన్ కళ్యాణ్‌తో లవ్.. ఆ తర్వాత
పవన్ కళ్యాణ్‌తో 'బద్రి' సినిమాలో రొమాన్స్ చేసి.. ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కీర్తించబడింది రేణు దేశాయ్. ఆ తర్వాత అదే పవన్‌ని ప్రేమించి పెళ్ళాడి సినిమాల్లో కనిపించడం మానేసింది. బట్ వీళ్ళ కాపురం ఎక్కువకాలం నిలవలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఇరువురు విడిపోయారు.

ఇప్పుడు రెడీ అంటున్న రేణు దేశాయ్
ఇక ఆ తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు మాత్రం తన పిల్లలతో జీవితం గడుపుతోంది. పూణెలో నివాసం ఉంటూ కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా పనిచేసి తనదైన ముద్రవేసింది రేణూ దేశాయ్. కాగా తాజాగా ఆమె మరోసారి వెండితెరపై నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా పవన్ తోనే కావడం విశేషం.

వకీల్ సాబ్‌తో పవన్.. రేణుదేశాయ్ కూడా
మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్.. వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు మూడు సినిమాలు లైన్‌లో పెట్టేశారు. అందులో ఒకటి 'పింక్' రీమేక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులోనే రేణుదేశాయ్ కూడా నటించనున్నట్లు టాక్ వస్తోంది.

ఏ మాత్రం సందేహించని రేణు.. పవన్ కూడా సై
‘పింక్' రీమేక్‌లో ఓ తల్లికి బిడ్డగా నటించాల్సిన పాత్ర ఉంటుందట. దానికి దర్శక నిర్మాతలు రేణుదేశాయ్ అయితే బాగుంటుందని ఎంపిక చేశారని తెలుస్తోంది. పవన్ సినిమాలో నటించేందుకు రేణు ఏ మాత్రం సందేహించలేదట. పైగా ఈ విషయం పవన్‌కి చెబితే ఆయన కూడా అభ్యంతరం చెప్పలేదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

రేణు దేశాయ్ ఫిదా.. బట్ ఓ ఆలోచన
డైరెక్టర్ వేణు శ్రీరామ్ నేరేట్ చేసిన కథకు రేణు దేశాయ్ ఫిదా అయిందట. అయితే మొదట ఓకే అనుకున్నప్పటికీ.. చివరగా రేణూ ఈ సినిమాలో నటించాలా? వద్దా? అనే ఆలోచనలో పడిందట రేణు. ఈ మేరకు తన నిర్ణయాన్ని త్వరలోనే తెలియజేస్తానని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రేణు దేశాయ్ రెండో పెళ్లి.. సీక్రెట్‌గా!
ఇకపోతే గతేడాది ఓ వ్యక్తికి రింగ్ తొడుగుతున్న పిక్ షేర్ చేసి షాకివ్వడంతో రేణు దేశాయ్ కూడా మరో పెళ్లి చేసుకోబోతోంది ఫిక్స్ అయ్యారంతా. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని పలు హింట్స్ ఇస్తోంది.. కానీ పెళ్లి ఎప్పుడనేది మాత్రం సీక్రెట్‌గా ఉంచుతోంది రేణు దేశాయ్.