»   » ఏం చేస్తాం..హన్సిక పడకపోతే తోసేస్తే సరి

ఏం చేస్తాం..హన్సిక పడకపోతే తోసేస్తే సరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాను డాన్స్ చేసేటప్పుడో...సీన్ లో యాక్ట్ చేసేటప్పుడో పొరపాటున క్రింద పడితే ఆ సినిమా సూపర్ హిట్ అంటోంది హన్సిక. మొదట్లో దాన్ని పట్టించుకోలేదు కానీ ఈ మధ్య అలాంటివి బాగా నమ్ముతన్నానని చెప్తోంది. ఈ విషయమై హన్సిక మాట్లాడుతూ "పిల్లి ఎదురు రాకూడదు, తుమ్మితే బయలుదేరకూడదు అని చెప్పే వాళ్ళను చూస్తే నాకు నవ్వొచ్చేది. కానీ దక్షిణాదికి వచ్చాక చాలా విషయాలను నిశితంగా పరిశీలించాను. 'దేశముదురు' షూటింగ్‌ సమయంలో తుళ్లిపడ్డాను. 'సార్‌..హీరోయిన్‌ పడిపోయింది. మన సినిమా హిట్టే' అని ఎవరో అరిస్తే నాకు కోపమొచ్చింది. తర్వాత ఇలాంటి వాటిని చిన్నగా నమ్మడం మొదలుపెట్టాను" అని చెప్పింది. పాయింట్ బాగానే ఉన్నా ఆమె లేటెస్ట్ చిత్రాలు వరసగా భాక్సా ఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నాయి. భిళ్లా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన జయీభవ డబ్బాలు వారం కూడా తిరక్కుండా వెనక్కి వెళ్ళాయి. ఆ తర్వాత నితిన్ తో చేసిన సీతారాముల కళ్యాణం కూడా భాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. అంటే ఆ షూటింగ్ సమయ్యాలో ఆమె చెప్పిన దాని ప్రకారం క్రింద పడి ఉండదు. కాబట్టి సినిమా హిట్టవ్వాలంటే ఆమె పడకపోయినా బలవంతగానయినా తోసేయాలన్నమాట అంటున్నారు సినీ జనం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu