»   » 24 సూపర్ హిట్ టాక్: నితిన్ ఫుల్ హ్యాపీ

24 సూపర్ హిట్ టాక్: నితిన్ ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూర్య కోలీవుడ్ హీరో సూర్య, విక్ర‌మ్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూ.75 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 24 మూవీ ఈ రోజు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. బ్రిలియంట్ మేకింగ్ అంటూ సినీ ప్రముఖులూ మెచ్చుకుంటున్నారు. పరిస్థితి చూస్తే భారీ వసూళ్ళనే సాధించేటట్టు కనిపిస్తోంది 24 ..అందరి సంగతెలా ఉన్నా మన హీరో నితిన్ మాత్రం చాలానే హ్యాపీగా ఉన్నాడట.

అసలేమైందంటే '24' చిత్రం రిలీజ్ విషయంలో ఏర్పడ్డ వివాదమే ఈ డీల్ క్యాన్సిల్ కావడానికి కారణమైంది. సూర్య 24 చిత్రాన్ని మే 6న అంటే ఈరోజే తమిళం, తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అయితే ముందు అనుకున్న ప్రకారం ఇదే రోజు తెలుగులో నితిన్, సమంతాల కాంబినేషన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ..ఆ' రిలీజ్ అనుకున్నారు.


How Hero Nitin feels about missing suriya's 24 movie Deal

దాంతో అప్పట్లో మే 6న అయితే ఆ సినిమాను తాము రిలీజ్ చేయలేమని నితిన్ ఫాధర్ సుధాకర్ రెడ్డి, సూర్యకు చెప్పారట. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను తమిళం లో రిలీజ్ చేసిన రోజే తమిళనాడుతో పాటు పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ చేయాలని సూర్య స్పష్టం చేయడంతో. ఆ డీల్ కాస్తా క్యాన్సిల్ అయ్యింది.అంటూ వార్తలొచ్చాయి. కానీ మళ్ళీ జరిగిన మార్పుల తో శ్రేష్ట్ మూవీస్ సూర్యా తోనే నిలబడింది.మొత్తానికి సూర్య 24 ని వదిలి పెట్టకుండా సరైన నిర్ణయమే తీసుకున్నాడు నితిన్..


ఇక 'అ.. ఆ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో నితిన్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. ముందుగా టీమ్ 24కు కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా గురించి చాలా అద్భుతాలు వింటున్నానని, ఈ మాస్టర్ పీస్‌తో శ్రేష్ట్ మూవీస్‌కు కూడా అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. దర్శకుడు విక్రమ్‌కు, హీరో సూర్యకు థాంక్స్ చెప్పాడు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ ఓపెనింగ్ వచ్చిందని, ఆల్ ద బెస్ట్ అని కోలీవుడ్ హీరో మాధవన్ అన్నాడు. ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని కూడా చెప్పాడు.

English summary
Suriya's 24 Telugu Version Bagged by Actor Nitin.... But what happened
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu