»   » చిరు సూపర్ హిట్ ‘ఖైదీ నెం.150’హిందీ రీమేక్‌లో హీరో ఫైనల్

చిరు సూపర్ హిట్ ‘ఖైదీ నెం.150’హిందీ రీమేక్‌లో హీరో ఫైనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్‌. మురగదాస్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం 'కత్తి' బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ సాధించింది. దీనిని తెలుగులో చిరంజీవి హీరోగా 'ఖైదీ నెం.150' పేరుతో వి.వి వినాయక్‌ తెరకెక్కించారు. తెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇప్పుడు హిందీలోనూ రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇందులో హీరోగా బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా అభిమానులు పిలుచుకునే హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నట్లు సమాచారం. ముందు ఇందులో హీరోగా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నాడని ఈ విషయమై సల్మాన్‌, మురగదాస్‌ల మధ్య చర్చలు కూడా జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అక్షయ్‌ నటిస్తున్నట్లు కూడా వదంతులు వినిపించాయి. కానీ అక్షయ్‌ లిస్ట్‌లో వరుస సినిమాలు ఉండడంతో ఆ అవకాశం హృతిక్‌ని వరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మురగదాస్ డైరక్ట్ చేస్తారని తెలుస్తోంది.


Hrithik, considered for Telugu 'Khaidi No.150' remake

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమాతో రికార్డులను బద్దలు కొడుతాడు అనుకున్నారు కానీ.. మరీ ఈ రెంజ్ లో సునామీ సృష్టిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. మొదటి రోజే ఈ సినిమా 'బాహుబలి'నే బీట్ చేసింది. ఆ తర్వాత ఊహించని రెంజ్ లో వసూళ్లు రాబడుతూ రికార్డ్ లు క్రియేట్ చేసింది.


తమిళ 'కత్తి'కి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం పోషించిగా. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. "కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ" బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించారు.

English summary
Hrithik Roshan has shown interest in Chiru's 'Khaidi No.150' remake project and a producer is in talks regarding that. The original film has done a business of Rs 100 crore and is still running in theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu