జూ.ఎన్టీఆర్‌కు హృతిక్ రోషన్ షాక్.. వార్ 2 రిజల్ట్‌తో బాలీవుడ్ స్టార్ రియాక్షన్?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ వార్ 2. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్రం చిత్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2ను డైరెక్ట్ చేయడం విశేషం. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేక పోయింది. ఓపెనింగ్ డేనే సినిమాకు మిక్స్ డ్ టాక్ దక్కడం గమనార్హం.

అయితే, వార్ 2 చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఇప్పటికే తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇబ్బందుల పాలవుతున్నారని అంటున్నారు. వార్ 2 చిత్రంతో నాగవంశీకి భారీ నష్టం కలిగిందనే ప్రచారం ఓపై జరుగుతూనే ఉంది. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పై హృతిక్ రోషన్ అసంతృప్తిగా ఉన్నారంటూ సరికొత్త ప్రచారానికి తెర లేపారు. అందుకు కారణంగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ను ఇన్ స్టా గ్రామ్ వేదికన అన్ ఫాలో చేయడమే అని చెప్పుకొస్తున్నారు.

Hrithik Roshan Unfollowed Jr NTR from Instagram

వార్ 2 చిత్రం అటు హిందీలో, ఇటు తెలుగులో ప్రస్తుతం ఓ మాదిరిగా కలెక్షన్స్ అందుకుంటూనే ఉంది. ఇదే సమయంలో ఆశించిన మేర ఫలితాన్ని అందించలేకపోయిందని, పైగా తారక్ తో కలిసి నటించడం పెద్దగా ఫలితం లేకుండా పోయిందని హృతిక్ భావిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం వీటిని కొట్టి పారేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అని చెబుతున్నారు. మున్ముందు కమర్షియల్ గానూ మంచి రెస్పాన్స్ దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు హృతిక్ రోషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తారక్ నాకు తమ్ముడి లాంటి వాడని, వార్ 2 చిత్రంతో నాకు మంచి బ్రదర్ దొరికాడని చెప్పడం విశేషం. అంతే కాదు తారక్ నుంచి న్యూ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ స్కిల్స్ నేర్చుకున్నానని కూడా వేదికపైనే చెప్పడం అందరినీ ఆశ్చర్య పరించింది. అందుకు ధీటుగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా హృతిక్ రోషన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా ఒకరిపై మరొకరకు పొగడ్తల వర్షం కురిపించుకోవడం అభిమానులను ఖుషి చేసింది.

కాగా, ప్రస్తుతం వీరిద్దరూ దూరం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం అవాస్తవమని తేలిపోతుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ హిందూ మైథలాజికల్ ఫిల్మ్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నుంచి స్లాండలోన్ ఫిల్మ్స్ కు కూడా అవకాశాలు అందుతుండటం విశేషం. ఇక హృతిక్ రోషన్ నెక్ట్స్ క్రిష్ 4 ప్రాజెక్ట్ లో నటిస్తూ డైరెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: hrithik roshan jr ntr war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X