»   » నయనతారపై హైదరాబాద్ స్టార్ హోటల్స్ బ్యాన్? ఏం జరిగింది?

నయనతారపై హైదరాబాద్ స్టార్ హోటల్స్ బ్యాన్? ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోవడమే కాదు అందుకు తగిన విధంగా అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి మీరీ తీసుకుంటుంది నయనతార. అటు సీనియర్ హీరోలైనా, ఇటు యువ హీరోలైనా పర్ ఫెక్టుగా సెట్టయ్యే అందంతో పాటు పాత్రకు తగిన విధంగా తనను తాను ట్రాన్స్ ఫార్మ్ అయ్యే టాలెంట్ ఆమె సొంతం.

తనకు ఉన్న డిమాండ్ ను బట్టే నయనతార కూడా భారీగా రెమ్యూనరేషన్ డిసూలు చేస్తోంది. తనకు ఉన్న పాపులారిటీ, డిమాండ్ వల్ల వచ్చిన గర్వమో? లేక ఆమె తీరే అంతా? తెలియదు కానీ కొన్ని సార్లు నయనతార వల్ల షూటింగులు ఇబ్బందుల్లో పడే పరిస్థితి.

ప్రస్తుతం నయనతార తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బంగారం' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్ నయనతార వల్ల చాలా ఇబ్బంది పడిందట. డేట్స్ ఇచ్చి కూడా చాలా ఇబ్బంది పెట్టిందట.

నయనతార షూటింగులకు రాని కారణంగా ఓ సాంగు పెండింగులో పడిపోయిందని, ఆగస్టు 12న రిలీజ్ డేట్ ఉండటంతో ఆ సాంగు లేకుండానే సినిమా రిలీజ్ చేస్తున్నారని టాక్. సినిమా విషయంలోనే దర్శక నిర్మాతలకు ఇబ్బందిగా మారడమే కాదు... హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ యాజమాన్యాలకు కూడా నయనతార ఇబ్బందిగా మారిందట.

నయనతార తీరుతో పడలేక..బయటకు చెప్పుకోలేక ఇకపై ఆమెకు తమ స్టార్ హోటల్స్ లో రూమ్స్ ఇవ్వబోమంటూ అప్రకటిత నిషేదం అమలులోకి తెచ్చారట. ఇంతకీ నయనతార ఏం చేసింది? ఆమెపై నిషేదం విధించేంత తప్పు ఏం జరిగింది? అనే విషయాలు స్లైడ్ షోలో...

యాంగ్రీ వోల్కనో..

యాంగ్రీ వోల్కనో..

నయనతార ఎప్పుడూ యాంగ్రీ వోల్కనోలా కోపంగా ఉంటుందని, ఆమె యాటిట్యూడ్ వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.

కోపం వస్తే అంతే...

కోపం వస్తే అంతే...

నయనతారకు కోపం వస్తే ఎదరుగా ఎవరు ఉంటే వారిపై ప్రతాపం చూపుతుందని, ఆమె కోపానికి తమ హోటళ్లలోని ఇంటీరియర్స్, అలంకరణ సామాగ్రి దెబ్బతింటున్నాయని అంటున్నారు.

పరిహారం ఇస్తుంది కానీ..

పరిహారం ఇస్తుంది కానీ..

అలాంటివి జరిగినపుడు నయనతార వాటికి పరిహారం కడుతుంది కానీ... మరునాడు ఆ రూమ్ బుకింగ్స్ క్లోజ్ చేసి రిపేర్ చేయించడానికి సమయం పడుతుందని, ఆ సమయంలో తాము ఆయా రూమ్ ల నుండి వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు.

బంజారాహిల్స్ లో

బంజారాహిల్స్ లో

ఇటీవల ఇలాంటి సంఘటన జరుగ్గా బంజారాహిల్స్ లోని ఓ హోటల్ మేనేజర్ ఇకపై నయనతారకు తమ హోటల్స్ లో రూమ్స్ ఇవ్వబోమని, ఇతర హోటల్స్ నుండి కూడా ఇలాంటి కంప్లయింట్సే వస్తున్నాయని అంటున్నారు.

English summary
There are some interesting rumours about Nayantara. It is said that Nayantara is a headache for star hotel managements in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu