»   » పవన్ కళ్యాణ్ తో ఆఫర్ అనేది రూమర్ మాత్రమే

పవన్ కళ్యాణ్ తో ఆఫర్ అనేది రూమర్ మాత్రమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : " మీడియాలో ఓ వర్గం నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నానంటూ వార్తలు ప్రచారం చేస్తోంది. అది నిజం కాదు. ఇప్పటి వరకూ నాకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. నేను తర్వాత చేయబోయే రెండు చిత్రాలు యష్ రాజ్ ఫిల్మ్స్ వారివే. నాకు తెలుగులో మరిన్ని చిత్రాలు అయితే చేయాలని ఉంది ," అని వాణి కపూర్ చెప్పుకొచ్చింది.


యశ్ రాజ్ ఫిలింస్ వారు తెలుగులు చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ తొట్ట తొలిగా నిర్మిస్తున్న చిత్రం ఆహా కళ్యాణం తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 21 న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన వాణి కపూర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా ఆమెకు పవన్ సరసన నటించటానికి ఆఫర్ వచ్చిందని మీడియా లో వార్తలు వచ్చాయి.

I am not acting with Pawan Kalyan

పవన్,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న ఓ మైగాడ్ రీమేక్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించినట్లు,ఆ మేరకు ఆమెతో సురేష్ ప్రొడక్షన్స్ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే మరో ప్రక్క ఆమెను గబ్బర్ సింగ్ 2 లో సైతం తీసుకున్నారంటు వినపడింది. అయితే ఈ రెండూ తప్పే అని ఆమె తేల్చి చెప్పింది.

బాలీవుడ్ మూవీ 'శుద్ధ దేశి రొమాన్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన వాణి కపూర్‌కు ఆ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇదే అదునుగా సినిమా రంగంలో తన జోరు కొనసాగించాలని నిర్ణయించుకున్న ఆమె.....ఎఫ్.హెచ్.ఎం మేగజైన్‌ జనవరి 2014 ఎడిషన్‌పై హాట్ అండ్ సెక్సీ ఫోజులతో దర్శనమిచ్చింది. మేగజైన్‌పై ఆమె అప్పియరెన్స్ ఎంతో హాట్ హాట్‌గా ఉండటంతో......వాణి కపూర్ గ్లామర్ గురించి సర్వత్రా చర్చనీయాంశం అయింది. పలువురు ఫిల్మ్ మేకర్స్ కూడా ఆమె సౌందర్యం, పెర్ఫార్మెన్స్ తనకు సినిమాలకు ఏ మేరకు ఉపయోగ పడతాయి అనే విషయమై విశ్లేషించుకుంటున్నారు.

English summary

 "A section of media has reported that I am doing a film with Pawan Kalyan. But, that's not true! I haven't received any such offer till date. My next two films will be on Yash Raj Films banners. I also wish to do more films in Telugu," Vaani Kapoor clarified.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu