»   » ‘రాక్షసి’కి రమ్యకృష్ణ ఆదర్శప్రాయం అయిందా..?

‘రాక్షసి’కి రమ్యకృష్ణ ఆదర్శప్రాయం అయిందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు కోటిన్నర రూపాయలు పారితోషికం తీసుకుంటున్న హాట్ హాట్ తార ఇలియానా. ఆమె ఉంది అంటే సినిమా మార్కెట్ త్వర త్వరగా పూర్తయిపోతుంది. కుర్రకారుకు తన నడుము, కళ్లు అందంతో ఆకట్టుకుంటూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఇలియానా నంబర్ వన్ పొజిషన్‌కి వెళ్లింది. కానీ ఈ మధ్య ఆమె నిర్ణయాలు ఏమీ సరిగా తీసుకోలేకపోతోంది. గతంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఆమెకు లాభం తెచ్చేదిగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎంత ఆలోచించి తీసుకున్న నిర్ణయమైనా బెడిసికొడుతోంది.

ఈ నేపథ్యంలో 'శక్తి" చిత్రంలో ఆమె నటించింది. ఆ చిత్రం రిలీజ్ తర్వాత టాక్ సరిగా లేకపోవడం ఆ చిత్రంపై నెగిటివ్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సదరు చిత్ర హీరో నిర్మాతకు అశనిపాతంలా మారింది. చిత్రంలో నటించిన హీరోయినే్న చిత్రం బాగాలేదని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో వసూళ్లు మొత్తం పడిపోయాయి. దీంతో ఇలియానాపై జూనియర్ ఎన్టీఆర్ కోపాన్ని పెంచుకున్నాడని తెలుస్తోంది. అలాగే పవన్ కల్యాణ్‌తో వచ్చిన 'తీన్‌ మార్" చిత్రంలో కూడా మొదట హీరోయిన్‌గా ఇలియానానే అనుకున్నారు. కానీ కోటిన్నర డిమాండ్ చేసేసరికి త్రిషను తీసుకున్నారు. అలా అటు ఎన్టీఆర్ కుటుంబానికి ఇటు చిరంజీవి కుటుంబానికి ఇలియానా దూరమైన ఈ రాక్షసి ఇప్పుడు తన నిర్ణయాలు మార్చుకుంటుందేమో చూడాలి.

కాగా రీసెంట్ గా విడుదలయైన నేను నా రాక్షసి రిసల్ట్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జూ ఎన్టీఆర్ శక్తిలా ఈ సినిమా ప్రమోషన్ కి కూడా అలానే ప్రవర్తించి నేను నా రాక్షసి సినిమా నిర్మాత నల్లమలపు బుజ్జికి చిర్రెత్తించేలా చేసింది ఇలియానా. ఒకప్పుడు వరుసగా ప్లాప్ చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసి తనేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ఇలియానా కూడా అదే పరిస్థితిలో ఉందని పరిశీలకులు అంటున్నారు. వరుసగా ప్లాప్ చిత్రాల్లో నటించడం వల్ల ఇలియానాని ఐరన్ లెగ్ అంటున్నారు. రమ్యకృష్ణలా ఈ హాట్ గర్ల్ సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి ఐరన్ లెగ్ ముద్రను ఎప్పుడు పోగొట్టుకుంటుందో వేచి చూడాల్సిందే...

English summary
Right from the release of Jr NTR’s ‘Shakti’, hip beauty Ileana is making rounds in the bad books of Tollywood by not helping in film’s publicity. After a statutory warning from the Producer?s council, the beauty is taking mega-phone to give a boost to the film’s collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu