»   » ఇన్ సైడ్ స్టోరీ : స్టార్ హీరోలను వణికించటానికి మహేష్ స్కెచ్

ఇన్ సైడ్ స్టోరీ : స్టార్ హీరోలను వణికించటానికి మహేష్ స్కెచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ ని మొదటి నుంచి ఎవరిగిన వాళ్లు అంతా అతను మారిన మణిషి అంటున్నారు. దానికి కారణం అతను కెరీర్ వైజ్ చేసే ప్లానింగ్, జాగ్రత్తలు. ఇంతకు ముందు మిగతా స్టార్ హీరోలు లాగానే ఓ స్క్రిప్టు ఓకే చేసి ముందుకు వెళ్లటానికి సంవత్సరం టైమ్ తీసుకునేవాడు. ముఖ్యంగా ప్రెష్ స్క్రిప్టుల కోసం అతని అన్వేషణ సాగేది.

అయితే ఇప్పుడు అతని తీరు మారింది. వరస పెట్టి సినిమాలు కమిటవుతున్నాడు. ముఖ్యంగా ఈ విషమంలో మహేష్ ఫ్యాన్స్ ..అతని భార్య నమ్రతకు ధాంక్స్ చెప్పాలి. ఆమె స్టోరీ సిట్టింగ్స్, స్క్రిప్టు నేరేషన్స్ విషయంలో ఉండే సమయాన్ని సేవ్ చేస్తోంది. ఆమె కూడా కథలు విని ఇమ్మిడియట్ గా జడ్జిమెంట్ పాస్ చేస్తోంది. అలాగే బౌండెడ్ స్క్రిప్టుతో వచ్చిన వారినే ఎంకరేజ్ చేస్తున్నారు. స్టోరీ లైన్ తెచ్చి స్టోరీ సిట్టింగ్స్ అంటే కష్టమని క్లియర్ గా చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రీసెంట్ గా మహేష్ ..శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కంటిన్యూగా ..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నాడు. జనవరికు ఆ చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి రేసులో ఉండే ప్లానింగ్ లో ఉన్నాడు. దాంతో మహేష్ సినిమాల మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది.

ప్యారిస్ ట్రిప్

ప్యారిస్ ట్రిప్

ప్రస్తుతం మహేష్ ప్యారిస్ ట్రిప్ లో ఉన్నారు. అక్కడ ఆయన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం షూటింగ్ కు ఓ వారం గ్యాప్ రావటంతో ఇది సాధ్యమయ్యింది.

ఇంట్రస్టింగ్

ఇంట్రస్టింగ్

తొలిసారిగా మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్స్ చేయటంతో ఇది ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుగా మారింది

శ్రీమంతుడు కాంబినేషన్ మళ్లీ

శ్రీమంతుడు కాంబినేషన్ మళ్లీ

అందుతున్న సమాచారాన్ని బట్టి శ్రుతి హాసన్ మరోసారి మహేష్ తో జత కడుతుంది. అదీ మురుగదాస్ కాంబినేషన్ కోసం

పూరి తో మహేష్

పూరి తో మహేష్

పూరి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్. దాంతో వీరి కాంబినేషన్ కు ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ కానుంది.

మరో ప్రక్క బ్రహ్మోత్సవం అనంతరం కూడా ప్రాజెక్టులు వరస పెట్టి సైన్ చేసాసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఎ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో మరో చిత్రం గ్రీన్ సిగ్న ల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు ఒకే సారి ప్రారంభమవుతాయి. వీటిన్నటి తర్వాత రాజమౌళి తో చేసే ప్రాజెక్టుని మెటీరియల్ చేసే అవకాసం ఉంది.

ఇప్పుడు చాలా మంది మిగతా హీరోలకు అర్దం కానీ విషయం..మహేష్ దగ్గరకు మంచి స్క్రిప్టులు ఎలా వెళ్తున్నాయి అనేది. అంతేకాకుండా హిట్ డైరక్టర్స్ అంతా మహేష్ చుట్టూ తిరుగుతున్నారు. నమ్రత,మహేష్ లు ఈ సీక్రెట్ ని విప్పి చెప్పాలి.

English summary
Wondering how Mahesh is able to get all the good scripts and hit directors at once while they are struggling to catch hold of one striking script. Well! Mahesh and Namrata will have to reveal their secret.
Please Wait while comments are loading...