Just In
Don't Miss!
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓ ఊపు ఊపేసిన యంగ్ హీరోయిన్.. చిరంజీవి సైతం!!
మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ.. ప్రెసెంట్ సెట్స్‌పై ఉంది. బలమైన స్క్రిప్ట్‌తో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందిస్తున్నారు కొరటాల శివ.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. కథ ప్రకారం మరి హీరోయిన్‌కి కూడా చోటు ఉండటంతో అనుష్కను సంప్రదించినట్లు టాక్. ఇకపోతే ఈ మూవీలో యంగ్ హీరోయిన్ రెజీనాతో ఐటెం సాంగ్ చేయించారట కొరటాల. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఐటెం నంబర్‌లో చిరంజీవి సరసన తన స్టెప్పులతో అదరగొట్టిందట రెజీనా.

రెజీనా డాన్స్ మూమెంట్స్‌కి చిరంజీవి సైతం ఆశ్చర్యపోయాడని టాక్ బయటకొచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ధిమాక్ ఖరాబ్ సాంగ్ రేంజ్ లోనే ఓ ఊపు ఊపేసేలా ఈ పాటను కంపోజ్ చేశాడట మణిశర్మ. బాణీలకు తగ్గట్టుగా రెజీనా కూడా చించేసిందని తెలుస్తోంది.
దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల రానుందని తెలుస్తోంది. చిత్రంలో రామ్ చరణ్ కూడా భాగమై ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ సినిమాపై షూటింగ్ దశలోనే భారీ అంచనాలు నెలకొంటుండటం విశేషం.