For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజకు రాములమ్మ ఝలక్.. నీకు తల్లిగానా.. నో అంటూ..

  By Manoj
  |

  విజయశాంతి.. ఈ పేరుతో తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆ నాటి హీరోల నుంచి నిన్నటి తరం వాళ్ల వరకు ఎంతో మందితో ఆడిపాడిందామె. అలాగే, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో చాలా సినిమాలు విజయం సాధించాయి. అందుకే ఈమెను లేడీ అమితాబ్ అని పిలుస్తుంటారు. ఈమె చివరి సారిగా 2006లో 'నాయుడమ్మ' అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరోసారి ఆమె మేకప్ వేసుకోలేదు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు'తో ఆమె సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.?

  అక్కడ రాములమ్మ ఫుల్ బిజీ

  అక్కడ రాములమ్మ ఫుల్ బిజీ

  సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత మరింత స్పీడు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ మారడంతో కొంచెం వెనుకబడ్డారు. ఇక, రీఎంట్రీలో మాత్రం దుమ్ము దులుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

  విజయశాంతి రీఎంట్రీ

  విజయశాంతి రీఎంట్రీ

  విజయశాంతి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి మరోసారి మేకప్ వేసుకుంటున్నారు.

  ఆ పాత్రకు అనూహ్య స్పందన

  ఆ పాత్రకు అనూహ్య స్పందన

  ‘సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి పాత్ర అద్భుతంగా ఉండబోతుందని టీజర్, లుక్స్ చూస్తే అర్థం అవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఆమె చెప్పిన డైలాగ్‌కు విశేష స్పందన వస్తోంది. అలాగే, సినిమాలో ఆమె లుక్‌ కూడా ఎంతో హుందాగా కనిపిస్తోంది. దీంతో రాములమ్మ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

  అప్పుడే తీసుకుందామనుకున్నాడు

  అప్పుడే తీసుకుందామనుకున్నాడు

  విజయశాంతి అంటే దర్శకుడు అనిల్ రావిపూడికి ఎంతో ఇష్టమట. అందుకే ఆమెను గతంలోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆయన ప్రయత్నించాడని తెలిసింది. ఇందులో భాగంగా ఓ హీరో కోసం రాసిన ఓ స్క్రిప్టులో రాములమ్మకు కూడా అత్యంత ముఖ్యమైన పాత్రను క్రియేట్ చేశాడట. అయితే, ఆ సినిమాను ఆ హీరో ఒప్పుకోకపోవడంతో విజయశాంతిని సంప్రదించలేదని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
  రిజెక్ట్ చేసిన రాములమ్మ

  రిజెక్ట్ చేసిన రాములమ్మ

  మరో హీరో కోసం రాసిన స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి రవితేజతో అనిల్ చేసిన సినిమా ‘రాజా ది గ్రేట్'. ఇందులో మాస్ మహారాజ కళ్లు లేని వ్యక్తిగా కనిపించాడు. అతడికి తల్లిగా సీనియర్ నటి రాధికను తీసుకున్నారు. ఈమె కంటే ముందు ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి.. విజయశాంతిని సంప్రదించాడట. కానీ, సీనియర్ హీరో రవితేజ తల్లిగా చేయడానికి ఆమె ఒప్పుకోలేదని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Vijayashanti Srinivas is an Indian film actress, producer and a politician. In a film career spanning 30 years, she has acted in over 180 feature films in a variety of roles in various Indian languages including Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X