Just In
- 7 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫిక్స్! మరో రెండు సినిమాలు.. బయటపడ్డ అసలు మ్యాటర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని, వచ్చే ఎన్నికల సమయం దాకా తన సినిమా జర్నీపై ఓ క్లారిటీకి వచ్చేశారని టాక్ బయటకొచ్చింది. మరి ఇంతకీ పవన్ ప్లాన్ ఏంటి? ఇటు సినిమాలు, అటు రాజకీయాలు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? వివరాల్లోకి పోతే..

మెగా అభిమానుల్లో ఉత్సాహం.. పవన్ రీ ఎంట్రీ
ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎక్కడో ఓ చోట నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నా.. పవన్ రీ ఎంట్రీని అంతా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అందరిలో ఆసక్తి రేపుతున్నాయి.

పవన్ దారెటు? ముదిరిన చర్చలు
ఇటీవలే పింక్ రీమక్స్ సెట్స్ పైకి వచ్చేసిన పవన్ కళ్యాణ్.. ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ముహూర్తం పెట్టేసి మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఇదిలా ఉండగానే మూడో సినిమాను కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యారు. దీంతో పవన్ దారెటు? అనే కోణంలో చర్చలు ముదిరాయి.

పవన్ టార్గెట్ ఇదే!. ఈ మూడు సినిమాలే కాదు
ఈ పరిస్థితుల్లో పవన్ టార్గెట్ ఇదే!. ఈ మూడు సినిమాలే కాదు ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి దర్శకులు కూడా ఫిక్స్ అయ్యారు. త్వరలోనే వీటిపై కూడా అఫీషియల్ స్టేట్‌మెంట్ రాబోతోంది అనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. దీంతో పవన్ రీ ఎంట్రీ జర్నీపై జనాల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది.

ఇద్దరు బడా డైరెక్టర్లు.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్
ఈ మూడు సినిమాలు పూర్తయ్యే సమయంలోనే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాలని పవన్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు టాప్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ కథలు కూడా సిద్ధం చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. ఈ రెండు సినిమాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అసలు ప్లాన్ ఇదే.. అందుకే అలా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే మరో నాలుగేళ్ల సమయం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేయాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. అందుకే ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.