»   » నిజమా: గోపీచంద్ 'జిల్' కథ ఇదేనా?

నిజమా: గోపీచంద్ 'జిల్' కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా గా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా 'జిల్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా హారోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే చిత్రానికి సంభదంచిన ట్రైలర్స్ చాలా స్టైలిష్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం కథ గురించి రకరకాల కథనాలు వినపడతున్నాయి చిత్ర పరిశ్రమలో. అందులో ఒకటి మీకు వినిపిస్తున్నాం. ఇక్కడ చెప్పబోయే కథ నిజమా కాదా అన్నది తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ కథేమిటంటే...

ఈ చిత్రంలో గోపీచంద్ ...ఓ ఎ గ్రేడ్ ఫైర్ ఆఫీసర్ గా కనిపిస్తూంటాజు. అతను కమిట్మెంట్ కు, డిసిప్లేన్ కు మారు పేరు. ఓ రోజు విలన్ (కబీర్) రైట్ హ్యాండ్ ఫృద్వీరాజ్ (ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ పృధ్వీ) అతని వద్ద నుంచి ఓ పెద్ద ఎమౌంట్ కొట్టేసి పారిపోతూంటాడు. అది ఓ డీల్ సెటిల్ మెంట్ లో వచ్చిన డబ్బు. విలన్ కు పృధ్వీరాజ్ తనను మోసం చేసాడని తెలుస్తుంది. అతని కోసం వెతుకుతూంటారు. ఇలా ఉండగా పృద్వీ రాజు దాక్కున్న చోట ఓ ఫైర్ ఏక్సిడెంట్ అవుతుంది. గోపిచంద్ ..ఫైర్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి.. అక్కడి వాళ్లను కాపాడతాడు. అలాగే బాగా కాలిపోయిన పృద్వీని కూడా కాపాడుతాడు. అయితే అప్పటికే పృద్వీ పరిస్దితి చేయి దాటిపోతుంది. అతను చనిపోతూ..గుడ్ డే అని గోపీచంద్ కు సైలెంట్ గా చెప్పి చనిపోతాడు. ఇదంతా అప్పటికే అక్కడికి చేరిన విలన్ చూస్తాడు.

 Is it Gopi Chand's Jil Story?

దాంతో ఫృద్వీ తన దగ్గర కొట్టేసి దాచిన డబ్బుకు సంభందించిన ప్లేస్ సీక్రెట్ గోపీచంద్ కు చెప్పాడేమో అని సందేహపడతాడు. దాంతో అతను గోపీచంద్ ని టార్గెట్ చేయటం మొదలెడతాడు. గోపిచంద్ కు వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు గోపిచంద్ స్నేహితుడుని సైతం చంపేస్తాడు. అప్పుడు ఇంటర్వెల్.

సెకండాఫ్ ఓపెన్ చేస్తే... కన్ఫూజన్ లో ఉన్న గోపిచంద్.. విలన్ ని వెతుక్కుంటూ వెళ్లి అసలు విషయమేంటో కనుక్కుంటాడు. తను ఎందుకు టార్గెట్ చేయబడుతున్నాడో అర్దం చేసుకుంటాడు. అప్పుడు గోపిచంద్ కు అర్దం అవుతుంది. పృధ్వీ డబ్బు దాచిన బ్యాంక్ పేరు "గుడ్ డే" అని. అదే తనకు చివరి నిముషాల్లో తను అతన్ని రక్షించే ప్రయత్నం చేసినందుకు కృతజ్ఞతగా చెప్పాడని. దాంతో గోపిచంద్ ఆ డబ్బుని మొత్తం తనకు ట్రాన్సఫర్ చేసుకుని విలన్ ని ఆటాడుకుంటాడు. ఈ మద్యలో హీరో లవ్ స్టోరీ రన్ అవుతుంటుంది. దానికి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మిక్స్ అవుతూంటాయి.

ఇది ఫిల్మ్ నగర్ లో జనం అల్లిన కధా, లేక నిజంగానే ఈ కథ అన్నది తెలియాలంటే రిలీజ్ రోజు దాకా వెయిట్ చెయ్యాలి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ స్టెలిష్ లుక్‌తో కనిపించబోతన్నట్టు చిత్ర వర్గాల సమాచారం. హీరో గోపీచంద్ కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా వున్నట్లు తెలిసింది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ హంగులతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది.


పూర్తి కమర్షియల్ హంగులతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నారు. రన్ రాజా రన్ చిత్రానికి సూపర్ హిట్ సంగీతం అందించిన ఘిబ్రాన్ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు.

చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

English summary
Gopichand who scored the super hit with “Loukyam” is getting ready to repeat the history with his upcoming film “Jil” under debutante Radha Krishna Kumar direction.
Please Wait while comments are loading...