For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడో పెళ్లి చేసుకొన్న జయసుధ.. భర్త ఎవరంటే?

  |

  ప్రముఖ నటి జయసుధ మరోసారి పెళ్లి చేసుకొన్న విషయం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కొద్ది నెలల క్రితం జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకొని మరణించడం ఆమె జీవితంలో విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త ఆకస్మాత్తుగా ఈ లోకం విడిచి వెళ్లడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యారని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. అయితే ఇటీవల అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని మూడో వివాహం చేసుకొన్న విషయంపై మీడియాలో గుసగసలు వినిపించాయి. కానీ ఇటీవల జరిగిన వారసుడు ప్రెస్ మీట్‌కు జయసుధ మూడో భర్తతో కలిసి రావడం మీడియా కంటికి చిక్కింది. ఈ క్రమంలో జయసుధ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

  విజయ నిర్మలకు బంధువుగా

  విజయ నిర్మలకు బంధువుగా

  జయసుధ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. నటి, దర్శకురాలు విజయనిర్మల, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి దగ్గర బంధువు. బాలనటిగా ఆమె సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా అగ్రస్థానానికి చేరుకొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా కొనసాగుతున్నారు.

  కెరీర్ టాప్‌లో ఉండగా తొలి వివాహం

  కెరీర్ టాప్‌లో ఉండగా తొలి వివాహం


  హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో కొనసాగుతుండగానే రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిని జయసుధ మొదటి వివాహం చేసుకొన్నారు. అయితే వారిద్దరి దాంపత్యం ఎన్నో నాళ్లుగా సాగలేదు. భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో 1982లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత నిర్మాత నితిన్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారిద్దరి కాపురం అన్యోన్యంగా సాగింది. నితిన్ కపూర్, జయసుధ దాంపత్యం జీవితంలో నిహార్, శ్రేయాన్ ఇద్దరు కొడుకులు ఉన్నారు.

  నిర్మాత నితిన్ కపూర్‌తో పెళ్లి

  నిర్మాత నితిన్ కపూర్‌తో పెళ్లి


  అయితే నితిన్ కపూర్‌తో జయసుధ జీవితం బ్రహ్మండంగా సాగుతున్న సమయంలో ఆమెకు భారీ షాక్ తగిలింది. మానసిక రుగ్మతలతో, ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న నితిన్ కపూర్ ముంబైలోని ఓ భారీ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేసింది. భర్త మరణంతో జయసుధ తల్లడిల్లిపోయారు. ఆమె సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా రోజులు పట్టిందనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడించాయి.

  అమెరికా పౌరుడితో మూడో వివాహం?

  అమెరికా పౌరుడితో మూడో వివాహం?


  భర్త మరణంతో జయసుధ డిప్రెషన్‌లో ఉన్న సమయంలో తన స్నేహితుడు, సన్నిహితుడు ఆమెకు అండగా నిలిచారు. ఆమెను మామూలు మనిషిగా చేయడంలో ఆయన తన వంతు ప్రేమను, అభిమానాన్ని చూపించారు. దాంతో వారిద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. దాంతో తన స్నేహితుడిని మూడో వివాహం చేసుకొన్నారని సన్నిహితులు వెల్లడించారు. అయితే తన మూడో వివాహానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే విషయంలో లోప్రొఫైల్‌లో ఉంచారని చెబుతున్నారు.

  వీరసింహారెడ్డి ఫంక్షన్‌లో తోడుగా

  వీరసింహారెడ్డి ఫంక్షన్‌లో తోడుగా


  అయితే వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు దూరంగా ఉంచే జయసుధ ఇటీవల వారసుడు ప్రెస్ మీట్‌కు భర్తతో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. మీడియా వారిద్దరిని కెమెరాలో బంధించడంతో జయసుధ మూడో పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే జయసుధ పెళ్లి చేసుకొన్నాదా? లేదా మానసికంగా బాధలో ఉన్న జయసుధకు ఆమె స్నేహితుడు జీవితంలో తోడుగా ఉన్నారా అనేది విషయంపై క్లారిటీ లేదు. జయసుధ అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ విషయంపై క్లారిటీ రాదు అని మీడియా వర్గాలు అంటున్నారు.

  వారిసులో జయసుధ అద్బుతంగా

  వారిసులో జయసుధ అద్బుతంగా


  జయసుధ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది. తల్లి, వదిన, అమ్మమ్మ పాత్రలతో తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. ఆమె నటించిన వారిసు చిత్రం ఇటీవల రిలీజైంది. దళపతి విజయ్‌కి తల్లిగా నటించిన జయసుధ అద్బుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల గుండెను పిండేశారు. ఇంకా పలు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.

  English summary
  Popular Actress Jayasudha seen with Her companion at Veera Simha Reddy success meet at Hyderabad. Reports suggest that she has married to US Citizen few months back. here the news about her Third marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X