తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్? బేబీ బంప్‌తో ఫోటోషూట్ వైరల్

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీ కపుల్స్ అంతా గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ జోడీకి పెళ్లయి నాలుగేళ్లు కావొస్తుండగా .. ఎప్పుడెప్పుడు వీరు గుడ్ న్యూస్ చెబుతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ తరుణం రానే వచ్చిందని సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మల్లీశ్వరితో టాలీవుడ్ ఎంట్రీ

బూమ్ చిత్రంతో 2003లో బాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి సినిమాతోనే తన అందం, నటనతో కుర్రాళ్ల మనసులను గెలుచుకున్నారు కత్రినా కైఫ్. ఆ తర్వాత మల్లీశ్వరితో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కత్రినా.. అనంతరం బాలయ్యతో కలిసి అల్లరి పిడుగు సినిమా చేశారు. టాలీవుడ్‌లో గట్టిగానే పాగా వేస్తుందని అంతా అనుకున్నప్పటికీ రెండు సినిమాలకు ముంబైకి మకాం మార్చేసింది. బాలీవుడ్ అగ్రనటుల సరసన నటించే అవకాశాలు కొట్టేసిన కత్రినా.. భారతీయ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా, అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో ఒకరిగానూ నిలిచారు.

Is Katrina Kaif pregnant Baby Bump photo sparks buzz about first child with Vicky Kaushal

సల్మాన్‌, రణబీర్‌లతో ప్రేమాయణం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సుదీర్ఘకాలం పాటు డేటింగ్ చేసింది కత్రినా. దాదాపు పదేళ్ల పాటు వీరి మధ్య బంధం కొనసాగిందని బీటౌన్ వర్గాలు చెబుతాయి. పెళ్లి చేసుకుంటారని అనుకున్న దశలో సల్మాన్‌- కత్రినా విడిపోయారు. ఆ తర్వాత మరో స్టార్ హీరో రణబీర్ కపూర్, హాలీవుడ్ సింగర్ జియాన్ మాలిక్, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్ధ్ మాల్యాతోనూ కత్రినా డేటింగ్ చేసినట్లుగా పుకార్లు వినిపించాయి.

ఒక్క సినిమాలో నటించకుండానే ప్రేమలో
అయితే ఒక్క సినిమాలో కూడ కలిసి నటించకుండానే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మధ్య ప్రేమ చిగురించింది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఓ షోలో విక్కీ కౌశల్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. అతనితో కలిసి నటించాలని ఉందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అయితే విక్కీతో పోలిస్తే అప్పటికే కత్రినా స్టార్ హీరోయిన్. ఆ తర్వాత ఆరేళ్ల క్రితం ఓ అవార్డ్ కార్యక్రమంలో తొలిసారిగా కత్రినా - విక్కీ కౌశల్ జంట కలుసుకున్నారు. ఆ సమయంలోనే కత్రినాతో పెళ్లి ప్రపోజల్ పెట్టాడట విక్కీ. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, అవార్డ్ ఫంక్షన్‌లో పక్కపక్కనే కూర్చోవడం వంటి చర్యలతో కత్రినా, విక్కీ మధ్య ఏదో జరుగుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

నాలుగేళ్లుగా గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్
ఈ దశలో తాము పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి షాకిచ్చిన ఈ జంట.. 2021 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని ఓ పెద్ద ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయి దాదాపు నాలుగేళ్లు కావొస్తున్నా విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఎప్పుడు శుభవార్త చెబుతారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కత్రినా కైఫ్‌ ప్రెగ్నెన్సీపై పలుమార్లు రూమర్స్ రాగా వాటిని భార్యాభర్తలు ఖండించారు. అయితే ఈసారి మాత్రం కత్రినా కైఫ్ గర్భం దాల్చినట్లుగా బాలీవుడ్‌లో జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి.

ఆ ఫోటో షూట్‌తో అభిమానుల సంబరాలు
కత్రినా ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో కత్రినా మెరూన్ రెడ్ కలర్ గౌనులో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో ఆమె పొట్ట భాగం గర్భం దాల్చినట్లుగా బేబీ బంప్ మాదిరిగా ముందుకు వచ్చింది. దీంతో కత్రినా ఫోటోలు వైరల్ అయ్యాయి. కత్రినా గర్భం దాల్చారంటూ అభిమానులు, మీడియా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి. మరి నిజంగానే కత్రినా గర్భవతి అయ్యారా? బేబీ బంప్ ఫోటోలు నిజమేనా? ఏదైనా సినిమా లేదా వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ కోసం ఫోటో షూట్ చేశారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. కత్రినా, విక్కీలలో ఎవరో ఒకరు స్పందించకుంటే ఈ వార్తలకు చెక్ పడే అవకాశం కనిపించడం లేదు.

More from Filmibeat

Read more about: katrina kaif vicky kaushal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X