Nagarjuna Akkineni ప్రవీణ్ సత్తారు మధ్య ‘రొమాన్స్’ చిచ్చు.. కథ కంచికి అంటూ..

మన్మథుడు నాగార్జున అక్కినేని, యువ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో సినిమా అనగానే టాలీవుడ్‌లో ఆ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పీ రామ్మోహన్ రావు, నారాయణదాస్ కే నారంగ్, శరత్ మరార్ నిర్మాతలుగా ఈ సినిమాకు ముహుర్తం పెట్టారు. అయితే ఎంతో క్రేజీగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం ఆగిపోయిందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. అందుకు కారణం ప్రవీణ్ సత్తారు, నాగార్జున మధ్య చోటుచేసుకొన్న క్రియేటివ్ డిఫరెన్సేస్ కారణమని తెలుస్తున్నది. అయితే విభేదాలు ఎందుకు తలెత్తాయనే వివరాల్లోకి వెళితే....

 పీఎస్వీ గరుడవేగ తర్వాత

పీఎస్వీ గరుడవేగ తర్వాత

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్‌తో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ పీఎస్వీ గరుడవేగ రూపొందించిన తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారుపై అగ్ర హీరోల దృష్టిపడింది. పలువురితో కథా చర్చలు ముగిసిన తర్వాత చివరకు నాగార్జునతో ప్రాజెక్ట్ సెట్ అయింది. రా ఏజెంట్‌ పాత్రలో నాగార్జున.. లండన్‌లో సాగే కథతో సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు.

రా ఏజెంట్‌గా నాగార్జున

రా ఏజెంట్‌గా నాగార్జున

దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్‌గా నాగార్జున పనిచేసి రిటైర్డ్ అవుతారు. కానీ రిటైర్డ్ ఆఫీసర్‌గా సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటారు. కథాపరంగా కాజల్‌తో నాగార్జునకు బ్రేకప్ అవుతుందట. ఇలాంటి పరిస్థితుల్లో తన లైఫ్‌లో ఎదురైన సమస్యలను, దేశానికి కలిగిన ముప్పును ఎలా పరిష్కరించారనేది కథ.

అయితే కాజల్, తన పాత్రకు మధ్య రొమాంటిక్ తక్కువ ఉన్నాయనేది నాగార్జున అభిప్రాయం. ఆ కోణంలో కథను పెంచమని చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే.. వైల్డ్ డాగ్ సినిమా సీరియస్‌గా ఉంది.. తన నెక్ట్స్ సినిమా కొంత ఎంటర్‌టైనింగ్‌గా, సీరియస్‌గా సాగితే బాగుంటుందని నాగ్ సూచించారట.

కథలో మార్పులకు పట్టుబట్టిన నాగ్

కథలో మార్పులకు పట్టుబట్టిన నాగ్

అయితే కథలో కొన్ని మార్పులు చేయమని నాగార్జున సూచించడంతో కొంత వరకు ప్రవీణ్ సత్తారు అంగీకరించారని.. ఆ తర్వాత రొమాన్స్ ఎక్కువైతే కథలో ఉండే ఇంటెన్సిటీ తగ్గుతుందని నాగార్జునకు ప్రవీణ్ సత్తారు సూచించాడట. అయితే అందుకు నాగ్ అంగీకరించకపోవడంతో వారి మధ్య క్రియేటివ్ విభేదాలు చోటు చేసుకొన్నాయని సమాచారం. అది కాస్త ప్రాజెక్ట్‌ నిలిచిపోయే వరకు వెళ్లిందనే విషయం సినీ వర్గాలో చర్చనీయాంశమైంది.

బడ్జెట్ విషయంలో కూడా విభేదాలు

బడ్జెట్ విషయంలో కూడా విభేదాలు

ఇదిలా ఉంటే.. బడ్జెట్ విషయంలో కూడా నాగ్‌, ప్రవీణ్ సత్తారు, నిర్మాతల మధ్య కొంత గందరగోళం నెలకొన్నదనే వార్త ప్రచారంలో ఉంది. బడ్జెట్ విషయంలో నాగ్ సూచించిన కొన్ని విషయాలు కూడా నిర్మాతలకు ఇబ్బంది కలిగించిందనే మరో విషయం కూడా బయటకు వచ్చింది. ఈ విషయంపై నిర్మాతలు, హీరో నాగ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

ఫిలింనగర్‌లో జోరుగా వార్తలు

ఫిలింనగర్‌లో జోరుగా వార్తలు

అయితే నాగ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రానున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ విషయంలో రూమర్లు, వార్తలు ఫిలింనగర్‌లో విస్తృతంగా ప్రచారం కావడం గందరగోళంగా మారింది. అయితే ఈ రూమర్లపై చిత్ర యూనిట్ స్పందిస్తే గానీ.. ఈ వార్తలకు తెరపడే అవకాశం లేకపోలేదు. నిజంగానే ఈ సినిమా ఆగిపోయేంత వరకు వెళ్లిందా అనే విషయం అభిమానులను కంగారు పెడుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X