»   »  పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టోరీ లీకయ్యిందా...?

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టోరీ లీకయ్యిందా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పబ్లిసిటీ కోసం కావాలనే చేస్తున్నారో లేదంటే నిజంగానే లీక్ ఔతున్నాయో గానీ ఈ మధ్య వచ్చే ప్రతీ పెద్ద స్టార్ సినిమా మొదలవగానే లీకైన స్టోరీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథలు కనిపిస్తున్నాయి. లేటేస్ట్ న్యూస్ ఏమిటంటే. నిన్న ప్రారంభమైన పవన్ ఎస్.జె. సూర్యల కొత్త మూవీ మూల కథ లైన్ ఇదేనంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. ఈసినిమా పూజా కార్యక్రమం జరిగి ఒకరోజు గడవకుండానే ఈసినిమా కథ గురించి లీకులు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Pavan

వచ్చే వార్తల ప్రకారం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ లేటెస్ట్ మూవీ ఒక ఫ్యాక్షన్ లీడర్ ప్రేమ కథ అని వార్తలు వస్తున్నాయి. పవన్ ఈసినిమాలో ఫ్యాక్షన్ లీడర్ గా ప్రేమికుడుగా రెండు షేడ్స్ లో కనపడతాడట. కథ పూర్తి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటూ బ్యాక్ డ్రాప్ లో మాఫియా స్టోరీ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.

యూత్ ను టార్గెట్ చేసే విధంగా ఈసినిమాకు 'హుషారు' అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉందికానీ ఇది ఇంకా ఖరారు కాలేదు.ఇక పవన్ ఫ్లాష్ బ్యాక్ లో పూర్తి స్థాయి లవర్ బాయ్ గా కనిపించనున్నడట. మాఫియా,ఫ్యాక్షన్ రెండిటినీ సమానంగా రంగరించి ఫైట్ల విశయం లో మరీ ఎక్కువ వయోలెన్స్ లేకుండా స్టోరీ రాసుకున్నారట. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాటల రికార్డింగ్ ని కూడా పూర్తి చేసాడు.

అయితే పవన్ లేటెస్ట్ సినిమా కథ గురించి బయటకు వస్తున్న లీకులు వింటూ ఉంటే 2011 లో విడుదలైన పవన్ 'పంజా' సినిమా కథ గుర్తుకు వస్తోంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. పంజా కథ వింటేనే పవన్ మరో సినిమా "బాలు" గుర్తుకు వస్తుంది. ఇక ఈ కొత్త కథ కూడా అదే పంథాలో సాగితే సినిమా ఫలితం ఎలాఉంటుందో మరి. ఈ విశయం లో ఎస్జే సూర్య ఏ జాగ్రత్తలు తీసుకుంటాడో చూదాలి. ఏదేమైనా ఇప్పటికిప్పుడు పవన్ కి ఒక మంచి హిట్ అవసరం ఉంది. మరి ఈ కొత్త సినిమా పవన్ కి ఎలాంటి అనుభవాన్నిస్తుందో చూడాలి...

English summary
Pawan Kalyan’s new Movie Leaked Story in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu