»   » షాకింగ్: పవన్ రెమ్యునేషన్ అంతా?

షాకింగ్: పవన్ రెమ్యునేషన్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ నుంచి మళ్లీ పవన్ కళ్యాణ్ పేరు చెపితే భాక్సాఫీస్ లు బ్రద్దలు అవుతున్నాయి. ఆయనతో సినిమా అంటే నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రెమ్యునేషన్ ఓ రేంజిలో పెరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా ఆయన పివిపి బ్యానర్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన అక్షరాలా 18 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. అలాగే అత్తారింటికి దారేది చిత్రం నిమిత్రం 15 కోట్లు వరకూ తీసుకున్నాడని సమాచారం. ఈ మేరకు ఓ ఇంగ్లీష్ డైలీ కథనం ప్రచురించింది.

ఇంతకీ ఈ రెమ్యునేషన్ ఏ సినిమాకీ అంటే PVP బ్యానర్ లో పవన్ చేయబోయే చిత్రానికి అని చెప్తున్నారు. పోటా పోటీ మీద పవన్ తో సినిమా చేయాలనే ఆలోచనతో ఈ రేట్ ని ఫిక్స్ చేసి ఆఫర్ చేసి డేట్స్ పట్టారని అంటున్నారు. ఇక 'బలుపు' చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిని పివిపి సినిమా బేనర్ తాజాగా పవన్ కళ్యాణ్‌తో చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అని ఫిల్మ్ నగర్ సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల..వెళ్లి పవన్ కి కథ చెప్పారు. ఫ్యామిలీ నేపద్యంలో యాక్షన్ తో జరిగే ఆ కథ..పవన్ నచ్చిందని,ఇప్పుడు ఈ బ్యానర్ లో చేయమని చెప్పారని సమాచారం.

Is Pawan the highest paid actor in T-Town?

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రం తర్వాత పివిపి బేనర్ సినిమా మొదలు కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా పకటించారు. 'పివిపి సినిమా' సంస్థ తెలుగువాడైన ప్రసాద్ వి పొట్లూరికి చెందినది కావడం గమనార్హం. ఫిల్మ్ ఫైనాన్సియర్‌గా ప్రారంభమైన ఈ సంస్థ తొలుత తమిళ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తమిళంలో రాజపట్టై, ఇరండం ఉలగం సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలను తమిళంలో విడుదల చేసింది.

అయితే పవన్‌తో చేయబోయే సినిమాకు ఏ దర్శకుడు పని చేయబోతున్నారు, హీరోయిన్ ఎవరు, సాంకేతిక నిపుణుల లాంటి వివరాలేవీ ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆ సంస్థలో పని చేయడానికి పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మాత్రమే స్పష్టం అవుతోంది. గబ్బర్ సింగ్ 2 తర్వాత... పవన్ కళ్యాణ్ ఏ కథ ఓకే చేసినా, ఏ దర్శకుడిని ఎంపిక చేసినా.....ఆ సినిమా నిర్మాణ బాధ్యతను పివిపి సంస్థ తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది.

English summary

 Pawan, who reaffirmed his position at the top slot with "a remuneration of 15 crore" for Attarintiki Daredi, has already jumped into the next league. Power Star's latest pay cheque are only set to go higher! It is reliably learnt that Pawan has been offered 18 crore by a Cheanni based production house, for their upcoming film. Industry sources aver that Pawan's remuneration is a new record in itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu