»   » విదేశీ క్రికెటర్‌తో ప్రీతి జింతా లవ్ ఎఫైర్?

విదేశీ క్రికెటర్‌తో ప్రీతి జింతా లవ్ ఎఫైర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతా చెట్టూ ఎప్పుడూ ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. గతంలో అమ్మడి గురించి ఎన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పంజాబ్ జట్టు సహయాజమాని నెస్‌వాడియా, డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌సింగ్‌లతో ప్రీతి గతంలో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే.

తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని ఇటీవల ప్రీతిజింతా వ్యాఖ్యానించింది. ఇంతలోనే సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ తో కలిసి ముంబైలో ఓ రెస్టారెంటుకు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైనట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

Is Pretity Zinta Dating Cricketer David Miller?

ఇద్దరూ రాసుకుపూసుకు తిరిగడం, క్లోజ్ గా మూవ్ అవ్వడం బట్టి ఇద్దరి మధ్య ఏదో ‘సం' బంధం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ప్రీతిజింతా సహయాజమానిగా వ్యవహరిస్తున్న ఐపీఎల్‌లోని కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టులో మిల్లర్ కీలక ఆటగాడు. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అంటున్నారు.

గతంలో మిల్లర్ తో ప్రేమాయణం ఉందనే వార్తలను ప్రీతి జింతా కొట్టిపారేసంది. అయితే ఇప్పుడు ఏకంగా అతనితో కలిసి మీడియా కంట పడేలా చెట్టాపట్టాలసుకుని తిరుగుతూ ఇన్నాళ్లు తమ మధ్య రహస్యంగా సాగిన ప్రేమ బంధాన్ని ఇపుడు అందరికీ తెలిసేలా చేసిందని అంటున్నారు.

English summary
Preity Zinta seems to have once again found love from the world of cricket. The lovely actress was recently spotted in the company of South African cricketer David Miller who incidentally is also the star player of Preity’s IPL team King’s X1 Punjab.
Please Wait while comments are loading...