మహేష్ బాబు కంటే ప్రియాంక చోప్రాకు ఎక్కువనా? అదిరిపోయేలా రాజమౌళి స్కెచ్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో పాన్ గ్లోబల్ మూవీ రూపుదిద్దుకొంటున్న విషయంపై అనేక కథనాలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ, మలయాళ, బాలీవుడ్ నటులు భాగమయ్యారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను గ్లోబల్ మూవీగా మార్చేందుకు ప్రియాంక చోప్రాకు అత్యంత ప్రయారిటీ ఇస్తున్నట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అయితే ప్రియాంక చోప్రాకు ఇస్తున్న ప్రయారిటీ విషయంలోకి వెళితే..
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా SSMB29 అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు జక్కన్న పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను పలు దేశాల్లో రిలీజ్ చేయడానికి భారీ లెవెల్‌లో స్కెచ్ వేస్తున్నారు. ఈ మేరకు భారీగా బిజినెస్, రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాబుతో మూవీని స్టార్ట్ చేసినప్పుడు కేవలం పాన్ ఇండియా మూవీగా మార్చారు. అయితే ఈ సినిమాను RRR మించి క్రేజ్ పెంచేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ మూవీగా మార్చడానికి హాలీవుడ్‌లో మార్కెటింగ్ సంస్థలను అప్రోచ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాను ఓవర్సీస్‌లోని పలు దేశాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వార్నర్ బ్రదర్స్‌ను అప్రోచ్ అయ్యారు. వారి ద్వారా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఇదే కాకుండా తన మూవీని ఆస్కార్ అవార్డుల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఫారిన్ కేటగిరిలో ఇండియన్ సినిమా కాకుండా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా అన్ని కేటగిరిలో ఎంట్రీ ఇవ్వడానికి జక్కన్న ప్లాన్ చేశారు. అందుకోసమే గ్గోబల్ స్టార్స్‌ను కూడా ఈ సినిమాలో నటింప చేస్తున్నారు. పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అని సినిమా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే హాలీవుడ్‌లో ఈ సినిమాను ఫుల్ మార్కెటింగ్ చేయడానికి ప్రియాంక చోప్రా సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఆమెకు హాలీవుడ్‌లో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకొని రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో ఫేస్ ఆఫ్ ది మూవీగా ఉపయోగించుకొనే ప్రయత్నంలో ఉన్నారు అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ కారణంగానే ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్టు సమాచారం.
ఇక ఈ చిత్రంలో నటించిన ప్రియాంక చోప్రాకు భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. అయితే ఆమె పారితోషికం మాత్రం దాదాపు మహేష్ బాబుకు చెల్లించే మొత్తం కంటే ఎక్కువ అని కొందరు ప్రస్తావిస్తున్నారు. కానీ మహేష్ కంటే పారితోషికం తక్కువగానే ఉంటుందన అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండియా నుంచి గ్లోబర్ స్టార్‌గా ఇప్పటికే పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమెకు రికార్డు స్థాయి రెమ్యునరేషన్ చెల్లించి.. ఆమె ద్వారా హాలీవుడ్‌లోకి రాజమౌళి చేసే ప్లాన్స్.. స్కెచ్ ఊహించని విధంగా ఉంటున్నాయని చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











