»   » రాజశేఖర్ మరీ అతి చేస్తున్నాడు

రాజశేఖర్ మరీ అతి చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సరైన సినిమా ఒక్కటీ చేతిలో లేని రాజశేఖర్ మీడియా ముందు మాత్రం అదరకొడుతున్నాడు. తాజాగా తాను రామ్ గోపాల్ వర్మని సెంటిమెంట్ సీన్స్ పెట్టమని ఫోర్స్ చేసానంటూ, గోరింటాకు సినిమాలాంటిది అని చెప్తున్న మాటలు మీడియాలో జోక్ గా మారాయి. ఎవరి మాటా వినని మోనార్క్ దర్శకుడుగా పేరుపొందిన రామ్ గోపాల్ వర్మ...ఈయన ఫోర్స్ చేయటమేంటి అంటున్నారు. ఆ ఫోర్స్ కు పట్టపగలు సినిమాలో సెంటిమెంట్ సీన్స్ పెట్టడమేంటి అంటున్నారు. మహా అయితే వర్మకు సజెస్టివ్ గా చెప్పి ఉంటాడని అంటున్నారు. ఆయన సరే అని నిర్మాత రాజశేఖరే కదా అని సెంటిమెంట్ ని రంగరించి ఉండవచ్చు కానీ తానే ఫోర్స్ చేసి మరీ స్క్రిప్టు మార్పించుకున్నాననటం మాత్రం కామెడీగా ఉందంటున్నారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ ''ప్రతీ చిత్రంలోనూ ఒక వైవిధ్యమైన పాత్రని పోషిస్తున్నా. వర్మతో 'పట్టపగలు' చిత్రం చేయడం తృప్తినిచ్చింది. మామూలుగా ఒక హార్రర్‌ సినిమా చేయాలనుకుంటే నేను నటించడం వల్ల సెంటిమెంట్‌ కూడా బాగా పండిందని వర్మ అనడం మరువలేను. ఒక రకంగా నేను వర్మ ఫోర్స్ చేసి స్క్రిప్టుని మార్చేశాను. నా 'గోరింటాకు' చిత్రంలాగే మహిళలకు ఈ సినిమా చేరువవుతుందనే నమ్మకముంది అన్నారు.

Is Rajasekhar forced RGV

అలాగే... ''మహంకాళి' తర్వాత మూడేళ్లపాటు మరొక సినిమా చేయలేకపోయా. చాలా కథలు విన్నా కానీ... ఏదీ కలిసి రాలేదు. ఇటీవల మాత్రం అన్నీ బాగా కుదురుతున్నాయి. నెలకి ఒకటి చొప్పున వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నటుడిగా నా ప్రయాణాన్ని మలుపు తిప్పే సినిమాలు అవి. ఇకపై దర్శకులు నా గురించి కొత్త తరహా పాత్రలు సృష్టిస్తారన్న నమ్మకం కలుగుతోంది'' అన్నారు రాజశేఖర్‌.

రాజశేఖర్ నటించనున్న 'గడ్డం గ్యాంగ్‌' ఈ నెల 12 నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతోంది. తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వుమ్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో 'పట్టపగలు'లో నటించారు. ఆ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు 'వందకి వంద' చిత్రంలోనూ నటిస్తున్నారు.

తన తాజా చిత్రాలు గురించి చెప్తూ... 'గడ్డం గ్యాంగ్‌'లో నేను గడ్డం బాస్‌గా కనిపిస్తా. 'వందకి వంద' విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగే చిత్రం. నా కూతురు శివాని ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. శివానీకి ప్లస్‌ టు పరీక్షలు ఉండటంతో చిత్రీకరణకు విరామం వచ్చింది. 'గడ్డం గ్యాంగ్‌' పూర్తికాగానే 'వందకి వంద'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

English summary
Rajasekhar said, "As per my experience, RGV is the speed film maker I ever met in Indian cinema. He has enormous knowledge on each and every aspect of film making. Though RGV do not like adding sentiment into his films, he has done it on my request in 'Patta Pagalu.' The movie has come out good and will release very soon,"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu