Just In
Don't Miss!
- Lifestyle
వెన్నునొప్పిని తేలికగా తీసుకోకూడదని ఇక్కడ కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి!
- Automobiles
భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!
- News
Kangana: దెబ్బకు హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్, మేడమ్ మాటలు నేర్చింది !
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తమిళంలోకి ఉప్పెన రీమేక్... సూపర్ స్టార్ కుమారుడు హీరోగా కోలీవుడ్ ఎంట్రీ
మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా తొలి చిత్ర దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఉప్పెన. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు మొదటి నుంచే బ్రహ్మండమైన వసూళ్లను రాబడుతూ దక్షిణాదిలోనే కాకుండా హిందీ సినీ వర్గాల దృష్టిని తమవైపుకు తిప్పుకొన్నది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని తమిళ సూపర్‌స్టార్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
పొట్టి దుస్తులో పరువాలు ధారపోస్తున్న మన్నారా చోప్రా..

70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు
ఉప్పెన చిత్రం ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకొన్నది. గత 10 రోజుల్లో సుమారు రూ.50 కోట్ల నికర కలెక్షన్లు, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి తన స్టామినాను రుజువు చేసింది. ఇంకా పలు చోట్ల భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది.

తమిళంలోకి రీమేక్ చేసేందుకు
తమిళ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే వైవిధ్యమైన ఉప్పెన మూవీని తమిళంలో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ సినిమా హక్కులను పొందేందుకు బాగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

దళపతి విజయ్ కుమారుడు హీరోగా
గత కొద్దికాలంగా తన కుమారుడు సంజయ్ జాసన్‌ను హీరోగా పరిచయం చేయనున్నారనే వార్తలు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఉప్పెన లాంటి కథతో తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తే బాగుంటుందనే ఆలోచన తాజాగా వచ్చినట్టు తెలిసింది. అయితే అలాంటి ప్రయత్నాలు విజయ్ చేయడం లేదని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంజయ్ జాసన్‌పై రూమర్లు అంటూ
ఇదిలా ఉండగా, విజయ్ కుమారుడు సంజయ్ జాసన్‌కు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ లేదు. కానీ డైరెక్షన్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఉప్పెన రీమేక్‌లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ విజయ్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు.