OG Alert: పవన్ కళ్యాణ్ చిత్రంలో భారీ మార్పులు.. ఈ తేదీ నుంచి నయా OG.. ఏంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ చిత్రం OG. ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు సుజీత్ ఈ చిత్రంతో ఫెస్టివల్ ట్రీట్ ను అందించారు. పవన్ కళ్యాణ్ ను తన అభిమానులు ఏ రేంజ్ లో చూడాలనుకున్నారో ఆ స్థాయిలో చూపించారు. దీంతో ఫ్యాన్స్ ధియేటర్ల వద్ద ఇప్పటికీ సందడి చేస్తూనే ఉన్నారు. అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు.
OG చిత్రంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, భారీ యాక్షన్ సీన్లు, జపాన్ భాషలో రాసిన డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పై పడ్డ ఎలివేషన్స్, ఎస్ఎస్ థమన్ అందించిన బీజీఎం, సాంగ్స్ ప్రేక్షకులను మళ్లీమళ్లీ థియేటర్లలోకి వచ్చేలా చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురుస్తోంది. దీంతో OG మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రేక్షకులు, అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఓజీ చిత్రం రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ కు, యాక్షన్ సీన్లకు భారీ రెస్పాన్స్ దక్కడంతో మరిన్ని అద్భుతమైన సన్నివేశాలను జోడించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. యాక్షన్ సీన్లతో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శెట్టి కి సంబంధించిన స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక నేహా శెట్టి డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం ఇచ్చారని, ఆ సాంగ్ షూట్ మొత్తం బ్యాంకాక్ లో జరిగిందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సాంగ్ ను ఎందుకు మిస్ చేశారని చాలామంది మేకర్స్ ను అడుగుతున్నారు. ఇటీవల థమన్ ఈ విషయం పైన కూడా స్పందించారు. ఆ సాంగ్ అద్భుతంగా వచ్చిందని త్వరలో మళ్లీ యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. కాగా నేహా శెట్టి నటించిన స్పెషల్ సాంగ్ తో పాటు, మరిన్ని యాక్షన్ సీన్లను కూడా జోడిస్తున్నారంట. ఇక సెప్టెంబర్ 29 నుంచి ఈ రీలోడెడ్ వర్షన్ ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఓటిటి రిలీజ్ లో జత చేసే అవకాశం ఉందని గాసిప్ నడుస్తుంది. దీనిపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు.
OG చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో రూపొందించారు. టాప్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.250 కోట్లతో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక 3 రోజుల్లో ఈ చిత్రం రూ.240 కోట్లపైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











