విజయశాంతి వల్ల ‘సరిలేరు’ ఆలస్యం.. ఆమెకే ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పరిస్థితి.!

By Manoj

సంక్రాంతి కానుకుగా రాబోతున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటల వల్ల అవన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం చాలా బాకీ పడిపోయిందట. ఈ నేపథ్యంలో సినిమాలో నటిస్తున్న లేడీ అమితాబ్ విజయశాంతి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే..

గుమ్మడికాయ కొట్టారు.. అవి స్టార్ట్ చేశారు

గుమ్మడికాయ కొట్టారు.. అవి స్టార్ట్ చేశారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అయితే, నటీనటుల డబ్బింగ్, కొన్ని గ్రాఫిక్ వర్క్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి అవే పనులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రష్మిక తన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసింది.

చిరు రాకతో ఉత్సాహం పెరిగిపోయింది

చిరు రాకతో ఉత్సాహం పెరిగిపోయింది

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న నిర్వహిస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ ఫంక్షన్‌కు చిరు హాజరు కాబోతుండడం చిత్ర యూనిట్‌తో పాటు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచింది.

పట్టుబట్టి మరీ తీసుకొచ్చిన డైరెక్టర్

పట్టుబట్టి మరీ తీసుకొచ్చిన డైరెక్టర్

సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ' సినిమా తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ సినిమాల్లోకి రాలేదు. కానీ, దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టి మరీ ఆమెను ఈ సినిమాలో నటించేలా ఒప్పించారు.

 విజయశాంతి స్పెషల్ అట్రాక్షన్

విజయశాంతి స్పెషల్ అట్రాక్షన్

చాలా కాలం తర్వాత సినిమాల్లోకి వచ్చిన విజయశాంతి లుక్ ఈ సినిమాలో ఎంతో హుందాగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌లో ఆమె కనిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే, ఈ సినిమా కోసం సీనియర్ నటి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. దీంతో ఆమె ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.

విజయశాంతి వల్ల ‘సరిలేరు' ఆలస్యం

విజయశాంతి వల్ల ‘సరిలేరు' ఆలస్యం

ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఇందులో విజయశాంతిని యంగ్‌గా చూపించేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతున్నారట. ఈ పనుల వల్ల సరిలేరు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X