For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మోడీ తరహాలో పవన్ కళ్యాణ్ సైతం...

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ పొలిటికల్ ఎంట్రీపై మీడియా సమావేశం రోజు దగ్గరకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సమావేశం గురించి రకరకాల వార్తలు బయిటకు వస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం....ఇరవై మూడు జిల్లాల్లోని అభిమానులను,ఒకప్పటి యువరాజ్యం సభ్యులను పవన్ కళ్యాణ్ మీడియా సమేవేశానికి ఆహ్వానిస్తున్నారు. దాని నిమిత్తం మూడు వేల పాస్ లు జారి చేసినట్లు సమాచారం. ఆ పాస్ లలో మీడియావారికి దాదాపు మూడు వందలు దాకా పాస్ లు ఉన్నాయి.

  అలాగే ఈ సమావేశానికి జాతీయ మీడియా ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. మీడియా సమావేశం రోజే జిల్లాల్లోని పలువురు సమాన్యూలతో పవన్ వీడియో కాన్ఫెరన్స్ నిర్వహించబోతున్నారు. మోడీ చాయ్ పే చర్చ తరహాలోనే పవన్ సామాన్యులతో లైవ్ ఛాటింగ్ చేయనున్నారని సమాచారం.


  రాజకీయ ప్రవేశానికి సంభందించిన మొదటి ప్రెస్ మీట్ ని పవన్ కళ్యాణ్ 14 వ తేదీ సాయింత్రం మాదాపూర్ లోని హై టెక్స్ లో నిర్వహించనున్నారు. ఆయన 6 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రసంగిస్తారు. అదే సమయంలో ఆయన తన టీమ్ ని, ఎలక్షన్సల్ లో నిలబడబోయే వారిని పరిచయం చేస్తారు. అలాగే ఆ క్యాండెట్స్ లో మాజీ బ్యూరో కాట్స్ , సామాజిక స్పృహ ఉన్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.

  It's Pawan's 'Chai Pe Charcha' campaign

  పవన్‌ కల్యాణ్‌ పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వూహాగానాలకు బలం చేకూరుస్తూ హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్‌ పేరిట ఒక హాలు నమోదైనట్లు తెలుస్తోంది. హైటెక్స్‌ వేదికగా ఈ నెల 14న సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ తాను స్థాపించబోయే కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.

  ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు హైటెక్స్‌కు రావల్సిందిగా ఆహ్వానాలు అందాయని సమాచారం. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే మీడియా సమావేశంలో సుమారు గంటసేపు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించనున్నారని, అనంతరం తాను రాజకీయాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పవన్‌ అనుచరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నట్లు సమాచారం.


  పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టబోతున్నారనే వార్తపై చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ స్పందించారు. రాజకీయాలపై తనకు అవగాహన లేదంటూనే పార్టీ స్థాపన అనేది బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత విషయమని, ఆపడానికి ఎవరికి హక్కు లేదని పేర్కొన్నారు.

  అలాగే... పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇప్పటికే అక్షరబద్ధం చేసినట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఈసారికి మొత్తం అన్ని స్థానాల్లో కాకుండా... 9 లోక్‌సభ, 40 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే 'పవన్ పార్టీ' పోటీ చేస్తుందని తెలుస్తోంది.

  మొత్తానికి... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు పార్టీ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ పెడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది అచ్చంగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, బహుశా... మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.

  English summary
  Reports suggest that the arrangements for Pawan Kalyan's much-awaited press meet are under brisk progress. Pawan's close associates like Trivikram Srinivas and a few others are supervising the works. The actor is said to have already sent out invitations to a few senior fans, who will meet him in the city on March 13. He is likely to have a discussion with fans a day before announcing his plans publicly.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more