»   » ఇన్ సైడ్ టాక్: 'లెజెండ్‌' తో జగపతిబాబు హర్ట్ అయ్యాడు

ఇన్ సైడ్ టాక్: 'లెజెండ్‌' తో జగపతిబాబు హర్ట్ అయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్‌'లో జగపతిబాబు జితేంద్రగా అలరించారు. ఇప్పుడాయిన పూర్తి బిజీ ఉన్న నటుడుగా మారారు. అయితే ఆయన తన కమ్ బ్యాక్ చిత్రం 'లెజెండ్‌' విషయంలో కొంత సంతృప్తిగా ఉన్నారని, హర్ట్ అయ్యాడని వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. వారు చెప్పేదాని ప్రకారం..జగపతిబాబు స్టైల్, ఆడ్రస్ అంతా ఆయన స్వంతగా డిజైన్ చేసుకున్నదే. అయితే ఆ క్రెడిట్ జగపతిబాబు కి ఎవ్వరూ ఇవ్వటం లేదు.

అలాగే జగపతిబాబు పాత్ర సినిమా చివర్లో చనిపోయేటప్పుడు చాలా పవర్ ఫుల్ డైలాగులతో చిత్రీకరించారు. అయితే పైనల్ కట్ లో అవన్నీ పోయాయి. ఇక ఆయన సినిమాలో మెయిన్ విలన్ అయినా పోస్టర్స్ లో ఎక్కడా ఆయన ప్రయారిటీ ఇవ్వటం లేదు. అలాగే విజయయాత్రలో గానీ, ప్రమోషన్ లో గానీ ఆయన్ను కలుపుకోవటం లేదు. కేవలం సక్సెస్ మీట్ లో మాత్రమే ఆయన్ను పిలిచారు.

Jagapathi Babu Not Happy With Legend

ఇక జగపతిబాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...ప్రతినాయకుడి పాత్ర పోషించాలి అనగానే చాలా ప్రశ్నలు. స్పందన ఎలా ఉంటుందో అని టెన్షన్‌ పడ్డా. ఇప్పుడు వస్తున్న స్పందన చాలా సంతోషాన్ని, అంతకు మించిన నమ్మకాన్నీ ఇచ్చింది. 'లెజెండ్‌' విడుదలయ్యాక పరిశ్రమలోని ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఇప్పటికే హీరోగా నా కెరీర్‌ అయిపోయింది. నా మార్కెట్‌ పడిపోయింది.

నటుడిగా నాకు విలువ ఉందన్న సంగతి నాకు తెలుసు. అందుకే ముందడుగు వేశా. నిజానికి ఇది మామూలు కమర్షియల్‌ సినిమాల్లో కనిపించే ప్రతినాయకుడి పాత్ర కాదు. నా పాత్రపై ప్రేక్షకుల్లో అంతో ఇంతో సానుభూతి కలుగుతుంది. అది ఒకవిధంగా ప్లస్‌ అయ్యింది. నా గెటప్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొన్నా. ఇటాలియన్‌ లుక్‌లో కనిపించా. ఆ కాస్ట్యూమ్స్‌ నాకు నేనుగా డిజైన్‌ చేసుకొన్నా అన్నారు.

అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే...జగపతిబాబు ఎప్పుడైతే.. అన్నిరకాల పాత్రలకూ తలుపులు తెరిచారో, దర్శకుల తలపులు కూడా మారాయి. జగపతి కోసం కొత్త పాత్రలు పుడుతున్నాయి. 'రా రా కృష్ణయ్య', 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇవికాక మరో మూడు చిత్రాలు అంగీకరించారు.

English summary
Jagapathi Babu has turned a star overnight with Legend. But Jagapathi Babu is apparently not happy with Legend’s director Boyapati Srinu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu