For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కోసమా దిల్ రాజు ఆ టైటిల్ ని....?

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్,దిల్ రాజు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసినా దిల్ రాజుకు ఇప్పటికీ పవన్ డేట్స్ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా పవన్ ...దిల్ రాజుకి ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దాంతో దిల్ రాజు ఈ జనగణమణ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. పవన్ తో చేయబోయే చిత్రం తమిళ,హిందీ,తెలుగు భాషల్లో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ

  ఇక జనగణమణ టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయగానే అంతా ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం కోసం అని భావించారు. అయితే దిల్ రాజు అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు వివరణ ఇచ్చారు. దాంతో ఈ టైటిల్ ఖచ్చితంగా పవన్ కోసమే అని ఫిక్స్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం పవన్ దృష్టి మొత్తం కెమెరామెన్ గంగ చిత్రం పైనే ఉంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమన్నా,పవన్ కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రంలో పవన్ మెకానిక్ గా కనిపించనున్నారు. ముఖ్యంగా పవన్ చేత చెప్పించే పంచ్ డైలాగులు ఈ సినిమాకు ప్రాణం అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రంలోని శ్రీకాకుళం స్లాంగ్ లో సాగే ఐటం సాంగ్ కూడా హైలెట్ అవుతుంది అంటున్నారు.

  దిల్ రాజు విషయానికి వస్తే ఆయన వరసగా రామ్ చరణ్ తో ఎవడు,మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు. ఎవడు చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తూంటే ...సిరిమల్లె చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేస్తున్నారు. వీరిద్దరూ దిల్ రాజు క్యాంపస్ నుంచి వచ్చిన వారే కావటం విశేషం. అలాగే రామ్ చరణ్ చిత్రంలో గెస్ట్ గా అల్లు అర్జున్ చేస్తూంటే,మహేష్ చిత్రంలో అతని అన్నగా వెంకటేష్ చేస్తున్నారు. ఇలా క్రేజీ కాంబినేషన్ తో ఈ చిత్రాలు రూపొందిస్తూ ట్రేడ్ లో అంచనాలు విపరీతంగా పెంచుతున్నారు.

  ఈ నేపధ్యంలో పవన్ తో సినిమా అనగానే గ్యారెంటీగా దిల్ రాజు క్యాంపస్ లోని దర్శకుడు అయ్య అవకాసం ఉందంటున్నారు. అంతేగాక ఈ చిత్రానికి ఏయే కమర్షియల్ హంగులు అద్దాలా అనేది ఇప్పటికే దిల్ రాజు మదిలో ప్లాన్స్ ఉండనే ఉంటాయంటున్నారు. అయితే దిల్ రాజు సినిమా అంటే పక్కా స్క్ర్రిప్టుతో వెళతాడు...అదీ దిల్ రాజు కు నచ్చే స్క్రిప్టు అని పేరు ఉంది. పవన్ ది అదే స్కూల్..తను చేసే సినిమా స్క్రిప్టుని తనే దగ్గరుండి చేయించుకుంటాడు. తన బాడీ లాంగ్వేజి కి తగ్గట్లుగా సినిమాని రూపొందించుకోవటంలో పవన్ సిద్దహస్తుడు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం అంటే ఎలా ఉండనుందో అని ఫిల్మ్ వర్గాల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. టైటిల్ ని బట్టి దేశభక్తి చిత్రం కూడా కావచ్చునని ప్రచారం కూడా జరుగుతోంది.

  English summary
  According to film nagar source that Dil Raju registered Jana Gana Manatitle Pawan Kalyan in order to make a social message oriented film. Dil Raju is eagerly waiting for dates of Power Star since last year but to his disappointment he couldn’t get. Now, Dil Raju registered the title Jana Gana Mana to make his dream ture with Pawan. Meanwhile, Pawan is currently doing Cameramangas Gangatho Rambabu with Puri and next he will star in Trivikram’s film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X