»   » ఎన్టీఆర్...10 కోట్లు ఇప్పిస్తున్నాడట...నిజమేనా?

ఎన్టీఆర్...10 కోట్లు ఇప్పిస్తున్నాడట...నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెద్ద హీరోల సినిమాలకు సాధారణంగా ప్రతీ విషయం వాళ్ల చేతిలోనే ఉంటుంది. దర్శకుల రెమ్యునేషన్ తో సైతం అని చెప్తూంటారు. అందుకే హీరోని పట్టుకుంటే చాలు రెమ్యునేషన్స్ , ప్రాజెక్టులు అవే సెట్ అవుతూంటాయి అంటూంటారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ తన దర్శకులకు బాగా ఇప్పిస్తూంటాడని చెప్తూంటారు. తాజాగా పట్టాలు ఎక్కబోతున్న జనతా గ్యారేజ్ చిత్రం కోసం కొరటాల శివకు పది కోట్లు రెమ్యునేషన్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. నిర్మాతలు ఎనిమిది కోట్లు అంటే ఎన్టీఆర్ పట్టు పట్టి మరీ పది కోట్లు ఇప్పిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

మోహన్ లాల్ క్యారక్టర్ లీక్ : ఎన్టీఆర్ కు అంకుల్, స్టోర్ కీపర్ గా...

Janatha Garage: Koratala Siva remunation 10 Cr?

మిర్చి చిత్రానికి 50 లక్షలు రెమ్యునేషన్ తీసుకుంటే...శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివకు నాలుగు కోట్లు రెమ్యునేషన్ ముట్టింది. దాంతో ఈ మొత్తం రెట్టింపు కన్నా ఎక్కువ కావటంతో కొరటాల శివ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మూడో సినిమాకే ఇలా పది కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవటం మామూలు విషయమేమీ కాదు.

ఈ స్దాయి రెమ్యునేషన్ ఇఫ్పటికే ఇండస్ట్రిలో రాజమౌళి, త్రివిక్రమ్, శ్రీను వైట్ల వంటి దర్సకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొరటాల శివ కూడా ఆ క్లబ్ లో చేరారు. శ్రీమంతుడు చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ఈ స్దాయి రెమ్యునేషన్ కు కారణం అంటున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

ఇదీ ఎన్టీఆర్ స్టామినా : చదవండి షాక్ అవుతారు

Janatha Garage: Koratala Siva remunation 10 Cr?

నాన్నకు ప్రేమతో చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. అతి త్వరలో సారధి స్టూడియోస్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ పనిచేసే గ్యారేజ్ ను.. దాని పరిసరాలను సెట్ వేశారు. ఈ సెట్ లుక్ అద్భుతంగా వచ్చిందని చూసినవాళ్లు చెబుతున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ జంటగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ లను అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమంతుడు నిర్మాతలు ...మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary
Buzz is that director Koratala is now being paid 10 crores for "Janata Garage" in which Jr NTR is playing the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu