Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ దేవరకొండను కాదనేసిన జాన్వీ కపూర్.. కుదరదంటూ జంప్!
శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి సంబందించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను ఆమె కాదనేసిందని టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని అందరూ భావిస్తే చివరకు ఆమె జంప్ అయిందని తెలుస్తోంది.
పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో కొత్త సినిమా (ఫైటర్) రానున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రిందటే కన్ఫర్మ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు పూరి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు జాన్వీ ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.

ఈ ఏడాది కొన్ని బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా జాన్వీకి డేట్స్ కుదరడం లేదట. అందుకే ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో పూరిజగన్నాథ్ ఆమె స్థానంలో వేరొక హీరోయిన్‌ని వెతుకున్నారనేది తాజా సమాచారం. అతి త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.
ఈ సినిమాకు ఫైటర్ అనే పేరును పరిశీలనలో ఉంది. చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది. చిత్రానికి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.