»   » కామెంట్స్ కు భయపడుతున్న జూ ఎన్టీఆర్..!?

కామెంట్స్ కు భయపడుతున్న జూ ఎన్టీఆర్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఊసరవెల్లి" సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఊసరవెల్లి" అనే టైటిల్ సమస్యగా మారింది. ఈ 'ఊసరవెల్లి" చిత్ర టైటిల్ కారణంగానే హీరో రామ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.. మొదట్లో దీనిపై ఎలాంటి పేచీ పెట్టని జూ ఎన్టీఆర్ కి ఈ టైటిల్ పై వినిపిస్తున్న ఫీడ్ బ్యాక్ అస్సలు నచ్చడం లేదనేది లేటెస్ట్ రిపోర్ట్. ఇకపై తనని అంతా 'ఊసరవెల్లి" ఎన్టీఆర్ అని పిలిచే అవకాశం ఉందని, మిగిలిన హీరోలు పులి, సింహం, చిరుత అంటూ రాయల్ జంతుల పేర్లు పెట్టుకుంటూ ఉంటే వాడుకలో చాలా హీనంగా చూసే ఊసరవెల్లి పదంతో సినిమా చేయడం ఎన్టీఆర్ కి ఇష్టం లేదంట.

నందమూరి వంశానికి పులి, సింహం, అంటూ వచ్చే టైటిల్లతో వచ్చే సినిమాలు బాగా విజయవంతం సాధించాయి. కానీ 'ఊసరవెల్లి" అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది..రంగులు మార్చే జీవి అని. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తాను ఇకటి చెప్పి మరొకటి చేస్తే అందరూ కూడా ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" లా చేస్తున్నాడని పిలవకూడదని, అదే విధంగా ఈ ఎన్టీఆర్ ఇమేజ్ కు ఈ చిత్రానికి ఈ టైటిల్ కరెక్ట్ కాదని, ఎలాగైనా ఈ టైటిల్ ను ఛేంజ్ చేయాలని దర్శకుడు సురేంధర్ రెడ్డిని ఎన్టీఆర్ మారం చేస్తున్నాడట. మరి ఎన్టీఆర్ బాధను అర్థం చేసుకుని సురేంధర్ రెడ్డి ఈ చిత్ర టైటిల్ ను మార్చుతాడో లేదో చూడాలి...

English summary
Young tiger Jr Ntr’s new film shooting under the direction of Surender Reddy is presently progressing in Hyderabad. Earlier we heard that the movie has been titled “Oosaravelli” and the movie first look posters with the movie logo were also out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu