జూ.ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ డిలేకి కారణం ఇదే.. 15 కోట్లు ఖర్చు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, దేవర వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించారు. ఇక తాజాగా వార్ 2 చిత్రంతో మరోసారి తన ఫ్యాన్స్, ఆడియెన్స్ ను థియేటర్లలో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీ స్టారర్ ఫిల్మ్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వారం రోజులుగా ఈచిత్రం మంచి వసూళ్లును అందుకుంటోంది. మిశ్రమ స్పందన వచ్చినా వసూళ్ల పరంగా అదరగొడుతోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రాలపై చర్చ కొనసాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ చిత్రం ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రంపై అంత్యంత భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూట్ జరిగింది. అయితే మొదటగా 3 రోజుల పాటే షూట్ జరిగిందని తెలుస్తోంది. మొట్టమొదటిగా ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారంట. 3000 మంది ఆర్టిస్టులతో కీలక చిత్రాలను షూట్ చేశారు.

ఇక ఆ తర్వాత షూటింగ్ మళ్లీ జరగలేదు. తారక్ వార్ 2 చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు సమయం ఇవ్వలేక పోయారంట. ప్రస్తుతం వార్ 2 విడుదలై, మిగితా కార్యక్రమాలన్నీ ముగియడంతో ఫుల్ ఫోకస్ డ్రాగన్ చిత్రంపైనే పెట్టారంట తారక్. అయితే మరోవైపు NTR31 ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి మరొక కారణం కూడా ఉందని తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ ఇంటి సెట్ ను నిర్మిస్తున్నదంట ఆర్డ్ డిపార్ట్ మెంట్. ఆ ఇంటి సెట్ నిర్మాణానికి నిర్మాతలు ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్.
ప్రశాంత్ నీల్ నిర్మాతల నుంచి ఎంత డబ్బు ఖర్చు చేయిస్తారో అంతకు డబుల్ తిరిగి ఇస్తుంటారు. ఇదే సమయంలో డ్రాగన్ చిత్రం కోసం భారీ సెట్ వేయిస్తుండటంతో ఇంకెలాంటి గూస్ బంప్స్ సీన్లను చిత్రీకరించబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సెట్ నిర్మాణ పనులు పూర్తి కావొస్తుందంట. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో లేదంటే 2వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభం కానుందని తెలుస్తోంది.
NTR31(డ్రాగన్) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మార్చి 2025 నుంచి షూటింగ్ జరుగుతోంది. ఇంకా చిత్రానికి పక్కా టైటిల్ ను ఫైనల్ చేయలేదు. ఇక ప్రాజెక్ట్ కు రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది 25 జూన్ 2025 న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఏమౌతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











