For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎన్టీఆర్‌తో మరోసారి తమన్నా ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'వూసరవెల్లి' కాంబినేషన్ మరో సారి ఫ్యాన్స్ ని అలరించబోతోంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్‌ హీరోగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తారు. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కు స్థానం ఉన్నట్లు సమాచారం. ఓ హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసుకొన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె 'వూసరవెల్లి'లో నటించిన సంగతి తెలిసిందే. దిల్‌ రాజు చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. గతంలో దిల్ రాజు,ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.

  దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రం స్కిప్టుని రీసెంట్ గానే ఎన్టీఆర్ పూర్తిగా విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్.


  చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఇప్పటికీ పూర్తి చేసారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

  మరో ప్రక్క ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్‌బాబు తెలియజేస్తూ' యాక్షన్‌తో అంశాలతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కొత్త ఎన్టీఆర్‌ను చూపించబోతున్నాడు. ముఖ్యంగా బ్యాంకాక్,ఇటలీలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

  బాద్షా చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ...ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు 'అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్ని నవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.

  English summary
  Tamanna will be romancing NTR this year again. This untitled flick will be directed by Harish Shankar of Gabbar Singh and produced by Dil Raju. A year ago we saw Tammannah and NTR in Oosaravelli. Though the chemistry between the two was good, the movie gathered dust.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more