»   » ఎన్టీఆర్, బాబి చిత్రం గురించిన ఈ విషయం ఇప్పుడు అంతటా సంచలనం

ఎన్టీఆర్, బాబి చిత్రం గురించిన ఈ విషయం ఇప్పుడు అంతటా సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఎన్టీఆర్ తదుపరి సినిమా కు సంభందించిన వార్తలు ఇప్పుడు మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నాయి. 'నాన్నకు ప్రేమతో...', 'జనతా గ్యారేజ్'చిత్రాలతో బాక్సాఫీసు వ‌ద్ద త‌న అస‌లైన స‌త్తా ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించేసిన ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రంపై ఇప్పుడు అంచ‌నాలు మామూలుగా లేవు.

సినిమా షూటింగ్ కూడా మొద‌ల‌యిందో లేదో ఈ చిత్రానికి సంబంధించి గ‌తంలో ఏ సినిమాకు లేని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తార‌క్ సోద‌రుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా థియెట్రికల్ రైట్స్‌ను ఏక‌మొత్తంగా 85 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసేందుకు ఓ ప్ర‌ముఖ‌ నిర్మాత ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాత‌ కళ్యాణ్ రామ్‌తో ఆ నిర్మాత చర్చలు కూడా జ‌రిపార‌ని తెలుస్తోంది.

కేవలం ధియోటర్ రైట్స్ కు

కేవలం ధియోటర్ రైట్స్ కు

అంతేకాదు అవ‌స‌ర‌మైతే మ‌రో ఐదారు కోట్లు ఎక్కువ‌కైనా ఈ చిత్ర హ‌క్కుల‌ను త‌న సొంతం చేసుకోవాలని ఆ నిర్మాత భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇంతా చేసి ఈ రేటు శాటిలైట్ కాకుండా కేవలం థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌కూ మాత్ర‌మే అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సహా

ఎన్టీఆర్ సహా

దాంతో శాటిలైట్ హ‌క్కులు ఇత‌ర‌త్రా క‌లుపుకుంటే క‌ల్యాణ‌ రామ్‌కు ఈ చిత్రంతో భారీగానే గిట్టుబాటు అయ్యి, కిక్ 2 తో వచ్చిన నష్టాలను దాటేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే క‌ల్యాణ‌ రామ్ ఈ విష‌యంలో కంగారుపడద్దని, ఎన్టీఆర్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో కళ్యాణ్ రామ్ ..కాస్త టైమ్ అడిగారని, ఇంకా ఏ విష‌యం తేల్చ‌లేద‌ని తెలుస్తోంది.

ఆగస్టుకల్లా..

ఆగస్టుకల్లా..

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే షూటింగ్ మొద‌లైన ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్ష‌కుల‌ముందుకు తేవాల‌న్నటార్గెట్ పెటుటుకుని మరీ చిత్ర యూనిట్ ప‌ని చేస్తోంది. సినిమా యూనిట్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుండటం, అందులో ఒకటి నెగటివ్ రోల్ అనే వార్త‌లు బ‌య‌ట‌కు రావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

విలన్ గా..

విలన్ గా..

ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంచుకునే టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లు విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా హాలీవుడ్ టెక్నీషియన్ తీసుకుని ఈ చిత్రం టీమ్ ...ఇప్పుడు బాలీవుడ్ నటుడుని విలన్ గా తీసుకుందని తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి నీల్ నితిన్ ముఖేష్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

మరో ఇద్దరినీ...

మరో ఇద్దరినీ...

ఎన్టీఆర్ మూవీ అని చెప్పగానే రెండో ఆలోచన లేకుండా నీల్ నితిన్ ముఖేష్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కు అవకాశం ఉండగా, ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను తీసుకున్నారు. త్వరలోనే మరో ఇద్దరిని ఓకే చేసే ఛాన్స్ వుంది.

పెద్ద సినిమాలకు సైతం...

పెద్ద సినిమాలకు సైతం...

ఇక ఈ సినిమాకి వీలైనన్ని హంగులను అద్దుతుంది చిత్ర బృందం.. ఈ చిత్రం కోసం హాలీవుడ్‌కు టెక్నిషన్ వాన్సీ హార్ట్‌వెల్‌ పని చేయనున్నాడు.లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై సినిమాలో ప్రోస్థెటిక్ లెగసి ఎఫెక్స్ అందించిన వాన్స్ తారక్ సినిమాకు పనిచేయడం గొప్ప విషయం.

అందుకే అంచనాలు

అందుకే అంచనాలు

ఇప్పటికే సినిమాకు పనిచేసేందుకు వాన్స్ హైదరాబాద్ చేరుకుని పని మొదలెట్టారు. తారక్ తో దిగిన పిక్ రివీల్ చేసి విషయం డిక్లేర్ చేశారు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు. సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి హాలీవుడ్ టెక్నిషియన్ ను వాడుతున్నారు అంటే సినిమాలో తారక్ కొత్త గెటప్ లో కనిపిస్తాడని చెప్పేయొచ్చు. ఈ టెక్నిషియన్ ఎంట్రీతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సీ కే మురళీధరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు.

ఒక పాత్ర కోసం కష్టం...

ఒక పాత్ర కోసం కష్టం...

ఎన్టీఆర్ ఎక్కువగా వర్కవుట్స్ చేస్తూ.. సన్నబడేందుకు బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. మూడు పాత్రల్లో మూడు రకాల వేరియేషన్స్‌ చూపించాలి అని. అందుకే ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా బరువు తగ్గుతున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకోసం జిమ్‌లో కసరత్తులు మొదలెట్టేశాడట

English summary
Rumors were doing the rounds that one of the producers has approached the makers of the movie Jai Lava Kusa to sell the out right Theatre rights to him for 85 Crores. If filmmakers didn't satisfy with that amount the producer is ready to pay another five crores to the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu