»   »  రామ్ చరణ్ కి అనుకున్న కథతోనే ఎన్టీఆర్ చిత్రం?

రామ్ చరణ్ కి అనుకున్న కథతోనే ఎన్టీఆర్ చిత్రం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. తన తాజా చిత్రాలు రభస, రామయ్య వస్తావయ్యా సెట్స్ మీద ఉండగానే మరో చిత్రం కమిటయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రం ఓకే చేసాడని తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రం నిర్మిస్తారు. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మరో ప్రక్క త్రివిక్రమ్,సుకుమార్, వక్కంతం వంశీ చిత్రాలుకు కూడా ఎన్టీఆర్ ఓకే చేసారు.


ఇక కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించే చిత్రం ఉంటుందని వినిపించింది. అనుకోని విధంగా ఆ చిత్రం ఆగిపోయింది. ఆ కథే ఇప్పుడు ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కథ వినగానే వెంటనే ఎన్టీఆర్ ఓకే చేసాడని చెప్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మాణం కానుంది.


మరో ప్రక్క కొరటాల శివ మరో చిత్రం కమిటయ్యారు. ప్రస్తుతం '1' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ ని ఒప్పించి, చిత్రం ఓకే చేయించుకున్నాడని టాక్. 'మిర్చి' ఘాటు చూపించి హిట్ కొట్టిన కొరటాల శివ రీసెంట్ గా మహేష్‌కి ఓ కథ వినిపించారని తెలుస్తోంది. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చడంతో... బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పారట. వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యూ టీవీ మోషన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

English summary
Jr.NTR is going to team-up with director Koratala Siva who has made super hit movie ‘Mirchi’ with Rebel Star Prabhas. The movie would be produced by Dvv Danayya. Koratala Siva who successfully made Mirchi movie with powerful diolgues wants to continue same action drame with Jr.NTR in his movie. If all plans fall in place, this film might go on sets from October. Danayya will be producing this film. Koratala Siva will be directing Mahesh Babu in the latter half of 2014 for the UTV production house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu