»   » కాజల్ పంట పండింది.. ఏకంగా బూరెల బుట్టలోనే..

కాజల్ పంట పండింది.. ఏకంగా బూరెల బుట్టలోనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో యువహీరో రణ్‌వీర్ సింగ్‌తో జతకట్టే అవకాశాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొట్టేసినట్టు సమాచారం. అయితే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన టెంపర్ చిత్రంలోనే కావడం మరో విశేషం. అంతేకాకుండా తమిళంలో రీమేక్ అవుతున్న టెంపర్ చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ కావడం కూడా పంట పండినట్లయింది.

టెంపర్ రీమేక్‌లో కాజల్

టెంపర్ రీమేక్‌లో కాజల్

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్నాడు. సూపర్ హిట్లయిన ఈ చిత్రం హక్కులను భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటించడం దాదాపు కన్ఫర్మ్ అయింది. అయితే టెంపర్‌లో కాజల్ ఫెర్ఫార్మెన్స్ నచ్చి హిందీలో కూడా నటించాలని కోరాడట. అందుకు సమాధానంగా ఆ చిత్రంలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

 తమిళంలో విశాల్ సరసన

తమిళంలో విశాల్ సరసన

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న టెంపర్ చిత్రం తమిళంలో కూడా రీమేక్ అవుతున్నది. ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. విశాల్ సరసన కాజల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. దీంతో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో రూపొందించే ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడంపై కాజల్ పంట పండిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 ఇప్పుడే చెప్పలేను..

ఇప్పుడే చెప్పలేను..

ఈ వార్తలపై కాజల్ స్పందిస్తూ.. బాలీవుడ్‌లో రెండు సినిమా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నన్ను రెండు ప్రముఖ బ్యానర్లు సంప్రదించాయి. అయితే అధికారికంగా ఇప్పుడే ఎలాంటి వివరాలు వెల్లడించలేను అని కాజల్ అన్నారు.

రణ్‌వీర్‌తో నటించాలని ఉంది..

రణ్‌వీర్‌తో నటించాలని ఉంది..

ప్రముఖ బ్యానర్లకు సంబంధించిన ఆ రెండు చిత్రాల్లో టెంపర్ లేదని అన్నారు. అయితే రణ్‌వీర్ సింగ్‌తో నటించడం నాకు చాలా ఇష్టం. అలాగే రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని కాజల్ తెలిపింది.

చిన్న సినిమాలు పబ్లిసిటీ అవసరం

చిన్న సినిమాలు పబ్లిసిటీ అవసరం

బాలీవుడ్‌లో టాప్ హీరోలు లేకుండా మంచి కథతో వచ్చే సినిమాలను గుర్తించడానికి పబ్లిసిటీ చాలా అవసరం. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో ప్రతీ శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో చాలా సినిమాలు గుర్తింపుకు నోచుకోకుండా వచ్చి వెళ్లిపోతుంటాయి అని కాజల్ పేర్కొన్నారు.

మెప్పు పొందినా వసూళ్లు లేవు.

మెప్పు పొందినా వసూళ్లు లేవు.

కొన్ని సినిమాలు విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నా మంచి వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. అలాంటి సినిమాలు దెబ్బతినక పోవడమే. కాబట్టి అలాంటి చిత్రాలకు పబ్లిసిటీ తప్పనిసరి అని అని కాజల్ అన్నారు.

2004లోనే బాలీవుడ్‌లోకి..

2004లోనే బాలీవుడ్‌లోకి..

2004లో క్యో హో గయా నా అనే చిత్రం ద్వారా కాజల్ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్, ప్రభాస్ లాంటి అగ్రహీరోల సరసన నటించింది.

English summary
Actress Kajal Aggarwal might reprise her role in the Hindi, Tamil remake of her Telugu superhit Temper. Kajal is set to reprise her role and will be cast opposite Ranveer Singh and Vishal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu