»   » సమంతాని చూసి భయపడుతున్న కాజల్ !?

సమంతాని చూసి భయపడుతున్న కాజల్ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య ఏం మాయ చేసావో హీరోయిన్ సమంతా తాజాగా ఎన్టీఆర్ చిత్రం బృందావనంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అందులో మెయిన్ హీరోయిన్ కాజల్. ఇప్పుడు ఈ కొత్త చిత్రం రిలీజయ్యాక సమంతకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. దాంతో దర్శకుడు వంశీ పైడిపల్లి తన క్యారెక్టర్ కన్నా ఆమెది పెంచుతాడేమని భయపడుతోందని వినిపిస్తోంది. ఎక్కడైనా క్రేజ్ ఉన్నవాళ్ళదే రాజ్యం కాబట్టి ఆ మార్పు జరగవచ్చునని అనుకుంటోంది. అలాగే తనను తీసుకుందామని చర్చలు జరుపుతున్న ఒకరిద్దరు నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చూపటం కూడా ఆమె జీర్ణించుకోలేకపోతోందని చెప్తున్నారు. వీటికి తోడు ఎన్టీఆర్ కూడా సమంతను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడని ఆమెని రికమెండు చేసింది కూడా అతనేనని తెలియటం కూడా కాజల్ కి నిద్రపట్టనీయటం లేదట. ఏదైమైనా కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరుకు ఈ సమస్యలు తప్పవు. అయితే మగధీర తర్వాత కాజల్ రేంజి మాత్రం బాగా పెరిగింది...ఆమె రెమ్యునేషన్ లాగే. అదే సమంతకు ప్లస్ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu